/rtv/media/media_files/2025/11/18/fat-around-the-belly-2025-11-18-14-06-03.jpg)
Fat Around Belly
మారుతున్న జీవనశైలి(daily-life-style), అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల(best-health-tips) కారణంగా.. నేటి తరం అధిక బరువు, మొండి పొట్ట కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. ఇది కేవలం వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. శరీరంలో పేరుకుపోయిన ఈ అదనపు కొవ్వు కాలక్రమేణా అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో.. సరైన బరువును నిర్వహించడం అత్యంత కీలకం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొండి పొట్ట కొవ్వును వేగంగా తగ్గించుకోవడానికి మూడు సులభమైన, ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటిస్తే కడుపు కొవ్వు కరిగిపోతుందని అంటున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి..
బరువు తగ్గడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(belly fat reduce tips) ను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటిసారి ప్రయత్నిస్తున్నట్లయితే.. 12:12 ఫాస్టింగ్ షెడ్యూల్‌తో ప్రారంభించవచ్చు. దీనిలో మీరు 12 గంటలు ఆహారం తీసుకోవడానికి, మిగిలిన 12 గంటలు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటానికి కేటాయించాలి. ఉదాహరణకు.. ఉదయం 7 గంటలకు తినడం ప్రారంభిస్తే.. రాత్రి 7 గంటలకు ముగించాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఉపవాసం ఉండాలి. ఈ పద్ధతి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఉపవాస సమయంలో క్యాలోరీ లేని, ఆరోగ్యకరమైన పానీయాలు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, యాపిల్ సైడర్ వెనిగర్, చక్కెర లేకుండా నిమ్మరసం, సోంపు లేదా తులసి నీరు, చామంతి లేదా అల్లం టీ వంటివి తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఉసిరికాయ రసం తాగొచ్చా..? తాగితే ఏమవుతుంది..?
ఈ పానీయాలు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా ఉపవాసం సులభతరం అవుతుంది. పొట్ట కొవ్వు(Belly Fat Control Tips)ను తగ్గించడానికి ఇది అత్యంత ముఖ్యమైన చర్య అని నిపుణులు అంటున్నారు. మీరు ఆహారం తీసుకునే 12 గంటల విండోలో అధిక-ఫైబర్, అధిక-ప్రోటీన్ ఆహారాలను చేర్చాలని నిపుణులు చెబుతున్నారు. అధిక-ప్రోటీన్ ఆహారాలంటే పనీర్, టోఫు, శనగలు, గుడ్లు, చికెన్, చేపలు, అధిక-ఫైబర్ ఆహారాలు.. పండ్లు, కూరగాయలు, సలాడ్‌లు, ఓట్స్, పప్పులు వంటివి తీసుకోవాలి. ప్రోటీన్, ఫైబర్ రెండూ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. అతిగా తినడాన్ని నిరోధించి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఒక్క గ్లాస్ క్యారెట్ జ్యూస్.. రోజు తాగితే ఏమవుతుందో తెలుసా!!
Follow Us