/rtv/media/media_files/2025/10/31/constipation-2025-10-31-20-19-05.jpg)
Constipation
నేటి వేగవంతమైన జీవనశైలి, సరికాని ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం (Constipation), కడుపు నొప్పి వంటి సమస్యలతో నిరంతరం బాధపడుతున్నారు. ఇవి రోజువారీ పనులను పాడుచేయడమే కాక.. పనిలో ఏకాగ్రతను కూడా తగ్గిస్తాయి. ఈ కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొందరు భారీ మోతాదులో యాంటీ బయాటిక్స్ తీసుకుంటుంటారు. కానీ అవి సమస్యను తగ్గించడం కంటే పెంచుతాయి.
వంటగదిలో, ఆయుర్వేదంలో లభించే కొన్ని పదార్థాలు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం ఇవ్వడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి త్రిఫల చూర్ణం (Triphala Powder). ఇది మార్కెట్లో 100 గ్రాములు కేవలం రూ. 20కి సులభంగా లభిస్తుంది. ఆయుర్వేద వైద్యులు దీని అద్భుతమైన ప్రయోజనాలను, వాడే విధానాన్ని వివరిస్తున్నారు. త్రిఫల చూర్ణం అద్భుత ప్రయోజనాలని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
త్రిఫల చూర్ణం ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి (Weight Loss): డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. ఉదయం త్రిఫల చూర్ణం తీసుకోవడం చాలా మంచిది. ఒక చిన్న చెంచా త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మొదలుపెట్టండి. ఇది శరీరం మెటబాలిక్ రేటును తగ్గించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
శరీరం శుద్ధి (Body Detoxification): ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన శరీరం పూర్తిగా డిటాక్సిఫై అవుతుంది. ఇది ప్రేగులు, జీర్ణవ్యవస్థలో పేరుకుపోయిన పాత మలినాలను, హానికరమైన వ్యర్థాలను తొలగించి.. శరీరాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది.
మలబద్ధకం: మలబద్ధకంతో బాధపడుతూ.. పొట్ట శుభ్రం కావడానికి ఇబ్బంది పడుతుంటే.. త్రిఫల చూర్ణం చాలా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతిరోజూ రాత్రి గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ప్రారంభించాలి. త్వరలోనే ఫలితాలు కనిపిస్తాయి.
 ఇది కూడా చదవండి: ఈ 5 లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. కడుపు క్యాన్సర్ కావొచ్చు!
అసిడిటీ (Acidity) ఉపశమనం: అసిడిటీని వదిలించుకోవడానికి త్రిఫల చూర్ణం చాలా ప్రయోజనకరం. ఇందుకోసం అర టీస్పూన్ త్రిఫల చూర్ణం, అర టీస్పూన్ అతిమధురం (Licorice Powder), కొద్దిగా నెయ్యి కలిపి పేస్ట్ లాగా తయారుచేయాలి. దీనిని భోజనానికి 40-45 నిమిషాల ముందు తీసుకుంటే.. అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాక.. ఇది కడుపులో పుండ్లు (Ulcers) వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
నోటి పూతలకు (Mouth Ulcers) ఉపశమనం: నోటి పూతలతో నిరంతరం బాధపడుతుంటే.. త్రిఫల చూర్ణాన్ని చల్లటి నీటిలో కలిపి ఆ నీటితో రోజుకు 2-3 సార్లు నోటిని పుక్కిలించాలి. దీని ప్రయోజనం మొదటి రోజు నుంచే కనిపిస్తుందని వైద్యులు అంటున్నారు. ఈ అద్భుతమైన ఆయుర్వేద చూర్ణాన్ని ఉపయోగించడం ద్వారా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఆవు నెయ్యి Vs గేదె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
 Follow Us
 Follow Us