/rtv/media/media_files/2025/10/31/ghee-tips-2025-10-31-18-42-29.jpg)
Ghee Tips
భారతీయ వంటశాలలో నెయ్యి కేవలం రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఒక నిధి. పప్పుకు పోపు పెట్టడానికైనా, రోటీలను మృదువుగా చేయడానికైనా ప్రతి ఇంట్లో నెయ్యి తప్పనిసరి. అయితే ఆవు నెయ్యి (Cow Ghee) మంచిదా లేక గేదె నెయ్యి (Buffalo Ghee) మంచిదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఈ రెండూ ఒకేలా కనిపించినప్పటికీ.. వాటి లక్షణాలు, రుచి, ఆరోగ్య ప్రభావాలలో ముఖ్యమైన తేడా ఉంది. చాలా మంది గేదె నెయ్యిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని, ఆవు నెయ్యి గుండెకు, జీర్ణక్రియకు మెరుగైనదని నమ్ముతారు. అయితే ఈ రెండు రకాల నెయ్యిల మధ్య తేడాలు ఏమిటో.. ఏది ఆరోగ్యానికి సరైనదో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్, ఆరోగ్య రహస్యాలు:
రంగు, ఆకృతిలో తేడా ఆవు నెయ్యి లేత పసుపు రంగులో ఉండి.. చాలా తేలికపాటి సువాసన కలిగి ఉంటుంది. ఇది తేలికగా, సులభంగా జీర్ణమవుతుందని భావిస్తారు. గేదె నెయ్యి తెలుపు రంగులో ఉండి కాస్త దళసరిగా (Thicker) ఉంటుంది. దీని రుచి కొంచెం ఘాటుగా, బరువుగా ఉంటుంది. గేదె నెయ్యి తిన్న తర్వాత కడుపులో బరువుగా (Heaviness) అనిపించవచ్చు. అదే ఆవు నెయ్యి తేలికగా ఉంటుంది.  ఆయుర్వేదం నిపుణుల ప్రకారం.. ఆవు నెయ్యిని సాత్విక (Sattvic) ఆహారంగా పరిగణిస్తారు. ఇది శరీరం, మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఇది జీర్ణక్రియను బలపరుస్తుంది, శరీరంలో చల్లదనాన్ని (Coolness) నిర్వహిస్తుంది. గేదె నెయ్యిని తామసిక (Tamasic) ఆహారంగా పిలుస్తారు. ఇది శరీరంలో శక్తిని, బలాన్ని పెంచుతుంది. 
 ఇది కూడా చదవండి: ఈ 5 లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. కడుపు క్యాన్సర్ కావొచ్చు!
బరువు పెరగాలనుకునేవారికి లేదా ఎక్కువ శక్తి అవసరమైన వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఏ నెయ్యి సరైనదో శరీర అవసరాలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. గుండె లేదా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు.. అలాగే బరువు తగ్గాలనుకునేవారు ఆవు నెయ్యిని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆవు నెయ్యి తేలికగా ఉండటమే కాక, మంచి కొవ్వులను (Good Fats) ఎక్కువగా కలిగి ఉంటుంది. గేదె నెయ్యిలో కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నీళ్ళెప్పుడు తాగాలి.. టీకి ముందా లేక తరువాత!!
 Follow Us
 Follow Us