/rtv/media/media_files/2025/10/31/stomach-cancer-2025-10-31-18-22-03.jpg)
Stomach cancer
ఈ రోజుల్లో కడుపు సమస్యలు చాలా సాధారణమయ్యాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా ఎసిడిటీ తరచుగా వేధిస్తుంటాయి. ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తేలికపాటి సమస్యగా భావించాలా లేదా ఏదైనా గంబీరమైన వ్యాధికి సంకేతమా అని గుర్తించడం కష్టమవుతుంది. అయితే విచిత్రంగా కడుపు క్యాన్సర్ (Gastric Cancer) విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి కడుపు క్యాన్సర్‌ను సూచించే ముఖ్యమైన ఐదు లక్షణాలు, ప్రమాద కారకాలపై దృష్టి పెట్టడం అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపు క్యాన్సర్ సూచించే 5 ముఖ్య లక్షణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కడుపు నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు:
కడుపులో భారం: చాలా తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ కడుపు నిండినట్లుగా, భారంగా (Fullness) అనిపించడం కడుపు క్యాన్సర్ లక్షణం కావచ్చు. కడుపు లోపలి పొరలో కణితి (Tumour) పెరగడం దీనికి కారణం కావచ్చు. తరచూ ఎసిడిటీ రావడం కూడా దీనికి సంబంధించినదే,
మలంలో రంగు మార్పులు, రక్తం: మలం రంగులో మార్పులు కనిపిస్తున్నా.. లేదా మలంలో రక్తం కనిపిస్తున్నా దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కొలన్ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) లక్షణం కూడా కావచ్చు.
కడుపు పైభాగంలో నొప్పి, మంట: తరచూ కడుపు దిగువ భాగంలో లేదా కడుపు పైభాగంలో (Upper Abdomen) నొప్పి వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు కడుపులో మంటగా అనిపించి, ఆ మంట ఛాతీ వైపునకు (గుండెల్లో మంట/Heartburn) విస్తరించవచ్చు. ఛాతీని ఎవరో గట్టిగా తిప్పుతున్నట్లుగా అనిపించే ఈ పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు.
 ఇది కూడా చదవండి: ఇంట్లోనే దంతాల పొడి చేయండి.. పళ్లు తల తలా మెరిసేలా చేసుకోండి.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి
విచిత్రమైన తేన్పు (Burping): భోజనం తర్వాత తేన్పు రావడం సహజం. కానీ విచిత్రమైన లోహపు రుచి (Metallic Taste)తో కూడిన లేదా పుల్లటి వాసనతో కూడిన తేన్పు వస్తుంటే.. అది కడుపులో కణితికి సంకేతం కావచ్చు. వెంటనే కడుపు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
బరువు తగ్గడం-ఇతర మార్పులు: కణితి కారణంగా శరీర బరువులో అనూహ్యమైన మార్పులు సంభవించవచ్చు.
కడుపు క్యాన్సర్‌కు కారణాలు:
కడుపు క్యాన్సర్ రావడానికి అనేక అంశాలు దోహదపడతాయి. వాటిలో ముఖ్యమైనవి. ధూమపానం (Smoking), అధిక మద్యపానం (Alcohol), ఊబకాయం (Obesity), అధికంగా మసాలాలు, ఉప్పు మరియు ఆమ్ల గుణాలు (Acidic) ఉన్న ఆహారం తీసుకోవడం, కుటుంబంలో ఎవరికైనా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చరిత్ర (Family History) ఉండటం, కాల్షియం, రబ్బరు లేదా కలప గనుల్లో పని చేయడం, ఎప్‌స్టీన్-బార్ వైరస్ (Epstein-Barr Virus) వంటి ఇన్ఫెక్షన్లు. పైన పేర్కొన్న లక్షణాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నట్లయితే.. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి.. అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వలన వ్యాధిని ప్రారంభ దశలోనే (Early Stage) గుర్తించి విజయవంతంగా చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తమలపాకుతో వైద్యం.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం మీరే చూడండి!!
 Follow Us
 Follow Us