/rtv/media/media_files/2025/12/09/cancer-2025-12-09-13-40-56.jpg)
Cancer
నేటి కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ చిన్న విషయం అయినా వైరల్ వుతున్నాయి. వీటిల్లో కొంత నిజాలు ఉంటే మరికొన్ని అపోహలు ఉన్నాయి. అయితే తాజాగా మహిళలు ధరించే బ్రా (Bra) బిగుతుగా ఉండటం లేదా దాని రంగు ముదురుగా ఉండటం వలన రొమ్ము క్యాన్సర్(Breast Cancer) వచ్చే ప్రమాదం పెరుగుతుందట. ఈ తరహా ప్రకటనలు మహిళల్లో అనవసరమైన ఆందోళనను పెంచుతున్నాయి. అయితే ఈ వాదనల్లో ఎంతవరకు నిజముంది..? బ్రా ధరించడం అనేది నిజంగా క్యాన్సర్‌కు దారితీస్తుందా..? ఈ ప్రశ్నలకు శాస్త్రీయ సమాధానాలను పరిశీలిస్తే.. బ్రా బిగుతు కానీ.. దాని రంగు కానీ రొమ్ము క్యాన్సర్‌కు ఏమాత్రం కారణం కాదని స్పష్టమవుతోంది. ఈ పుకార్లన్నీ కేవలం అపోహలు (Myths) మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు, అపోహల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పరిశోధన ఏం చెబుతోంది..?
రొమ్ము క్యాన్సర్‌కు బ్రాకు సంబంధం ఉందనే వాదనలకు శాస్త్రీయ ఆధారం లేకపోవడంతో.. ఈ అంశంపై పెద్దగా పరిశోధనలు జరగలేదు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న అధ్యయనాలు ఈ అపోహలను తోసిపుచ్చాయి. బ్రెస్ట్‌క్యాన్సర్ ఆర్గనైజేషన్ (Breastcancer Organization) ప్రకారం.. బ్రా ధరించడం, దాని బిగుతు, రంగు, లేక అండర్‌వైర్ (Underwire) బ్రాల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనడానికి శాస్త్రీయ ఆధారం లేదని చెబుతున్నారు. 2014 నాటి ఓ అధ్యయనం 55 నుంచి 74 ఏళ్ల మధ్య వయస్సు గల 1,513 మంది మహిళల బ్రా ధరించే అలవాట్లపై ఒక పెద్ద అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో బ్రా కప్పు పరిమాణం (cup size), బ్రా ధరించిన గంటల సంఖ్య, బ్రా యొక్క సరిపోయే విధానం (fit), బ్రా ధరించడం ఎప్పుడు మొదలుపెట్టారు అనే అంశాలు ఏవీ కూడా రొమ్ము క్యాన్సర్‌తో ముడిపడి లేవని స్పష్టమైంది. ఈ అధ్యయనం ప్రకారం.. బ్రా అనేది క్యాన్సర్ ప్రమాద కారకం కాదని తెలిపారు. - cancer cases in india
ఇది కూడా చదవండి: బ్రేక్ ఫాస్ట్‌లో ఆలూ పరాఠా తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ న్యూస్!!
పాత అధ్యయనాలు ఎందుకు తప్పుదోవ పట్టించాయి..? బ్రా, క్యాన్సర్ గురించి అపోహలు పుట్టడానికి కొన్ని పాత.. బలహీనమైన అధ్యయనాలు కారణమయ్యాయి. బ్రా ధరించని మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంభవం తక్కువగా ఉందని ఒక 1991 అధ్యయనం పేర్కొంది. అయితే ఆ డేటా చాలా బలహీనంగా ఉండటం వలన దాన్ని విశ్వసించదగినదిగా చెప్పటం లేదు. పరిశోధకులు తరువాత కనుగొన్నది ఏమిటంటే.. ఈ వ్యత్యాసానికి బ్రా కారణం కాదు. బదులుగా రొమ్ము పరిమాణం (Breast Size), శరీర బరువు కారణం కావచ్చని తెలుపుతున్నారు. అధిక బరువు (Excess weight) అనేది క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. పెద్ద రొమ్ములు ఉన్న మహిళలు తరచుగా వాటికి మద్దతు (support) కోసం బ్రాలను ధరిస్తారు. ఈ కారణంగా.. బ్రా ధరించడం, క్యాన్సర్ మధ్య సంబంధం ఉన్నట్లు అప్పటి అధ్యయనాలలో తప్పుగా కనిపించింది. కానీ ఇక్కడ నిజమైన ప్రమాద కారకం అధిక బరువు తప్ప బ్రా కాదని అంటున్నారు. - cancer case in 2025
అపోహ ఎలా వ్యాపించింది..?
బ్రా ధరించడం వల్ల క్యాన్సర్ వస్తుందనే అపోహను విస్తృతంగా వ్యాప్తి చేసింది 1995లో వచ్చిన డ్రెస్డ్ టు కిల్ (Dressed to Kill) అనే పుస్తకం. బ్రా ఒత్తిడి శోషరస వ్యవస్థ (Lymphatic System) ప్రవాహాన్ని అడ్డుకుంటుందని, దీనివల్ల శరీరం విషాన్ని (toxins) తొలగించకుండా పోతుందని, ఫలితంగా క్యాన్సర్ వస్తుందని ఈ పుస్తకం వాదించింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం ఏమాత్రం లేవని తెలుపుతున్నారు. బ్రా బిగుతు వల్ల లింఫ్ ప్రవాహం నిజంగా ఆగుతుందా? అంటే దీనికి సమాధానం ఖచ్చితంగా లేదంటున్నారు. శోషరస వ్యవస్థ అనేది చర్మానికి లోపల (deep within the body) ఉంటుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో ఒక భాగం. బ్రా అనేది చర్మం యొక్క ఉపరితలం (surface of the skin) పై మాత్రమే ఉంటుంది. బ్రా నుంచి వచ్చే ఒత్తిడి శోషరస వ్యవస్థ ప్రవాహాన్ని నిరోధించగలిగే స్థాయికి చేరుకోలేదు. ఒక బిగుతైన బ్రా కేవలం అసౌకర్యాన్ని, నొప్పిని కలిగించవచ్చు, కానీ క్యాన్సర్‌ను మాత్రం కలిగించలేదంటున్నారు. అంటే బ్రా రంగు క్యాన్సర్‌కు కారణమవుతుందా..? అంటే అస్సలు కాదని చెబుతున్నారు.
రంగు-క్యాన్సర్ మధ్య సంబంధం:
ముదురు రంగు బ్రా (నలుపు, ఎరుపు లేదా ఇతర డార్క్ షేడ్స్) ధరించడం వలన క్యాన్సర్ వస్తుందనే వాదనలో నిజం లేదు. బ్రా ఫ్యాబ్రిక్ (గుడ్డ) రంగులు, అవి ఎంత ముదురుగా ఉన్నప్పటికీ.. చర్మంలోకి చొచ్చుకుపోయి (penetrate) క్యాన్సర్‌ను కలిగించేంత స్థాయిలో రసాయనాలని విడుదల చేయవు. రొమ్ము క్యాన్సర్‌కు రంగుకు ఎలాంటి సంబంధం లేదు. అయితే మహిళలు బ్రా గురించి ఆందోళన చెందడం మానేసి.. నిజమైన ప్రమాద కారకాలపై దృష్టి పెట్టాలి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే నిరూపితమైన కారకాలు ఉన్నాయి. అవి వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది, తల్లి, సోదరి లేదా కుమార్తెకు రొమ్ము క్యాన్సర్ ఉంటే ప్రమాదం పెరుగుతుంది. ఇంకా అధిక బరువు ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా రుతువిరతి (Menopause) తర్వాత, వ్యాయామం చేయకపోవడం ప్రమాద కారకం. ఆల్కహాల్ తీసుకోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది, హార్మోన్ల చికిత్స, దీర్ఘకాలికంగా ఈ చికిత్స తీసుకోవడం వంటి ఉంటాయి. బ్రా బిగుతు లేదా రంగు రొమ్ము క్యాన్సర్‌కు కారణం అనేది కేవలం నిరాధారమైన అపోహ మాత్రమే. మహిళలు అనవసరమైన భయాన్ని పక్కనపెట్టి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడంపై దృష్టి సారించడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ 5 రోగాలు సైలెంట్ కిల్లర్లు.. లక్షణాలు లేకుండానే లేపేస్తాయి!
Follow Us