High Blood Pressure: ఒక్క వెజిటబుల్.. రెండు ప్రయోజనాలు!!

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. పాలకూర గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, కంటి చూపును రక్షించడంలో పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పాలకూరను తప్పకుండా చేర్చుకోవాలి.

New Update
vegetables and HB Pressure

Vegetables And HB Pressure

పాలకూర దీనిని ఆకుపచ్చని రంగులో ఉండే ఒక పోషకాల గనిగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు A, C, K,  సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా ముఖ్యమైనది. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, కంటి చూపును రక్షించడంలో పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది.అధిక రక్తపోటు(high-blood-pressure) గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి మందులతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. వంటింట్లో సులభంగా లభించే కొన్ని కూరగాయలు కూడా రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అటువంటి ఒక అద్భుతమైన కూరగాయ పాలకూర. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి పాలకూర తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాధారణ కూరగాయతో రక్తపోటును నియంత్రించవచ్చు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే..

పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, నైట్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా.. పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధిక రక్తపోటు గుండెపోటుకు ప్రధాన కారణం. పాలకూరలో ఉన్న నైట్రేట్స్ రక్తనాళాలను విశ్రాంతి పరుస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల గుండెపై ఒత్తిడి తగ్గుతుంది, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చిగా సలాడ్లలో, వండిన కూరలలో, సూప్‌లలో, స్మూతీస్‌లలో దీనిని ఉపయోగించవచ్చు. దీని ప్రత్యేకమైన రుచి వల్ల అనేక వంటకాలకు ఇది చక్కటి రుచిని ఇస్తుంది. దీనితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. 

ఇది కూడా చదవండి: ఛాతీలో పేరుకుపోయిన కఫంకు చెక్ పెట్టే వంటింటి చిట్కాలు ఇవే

తాజా పాలకూర(spinach) ఆకులను సలాడ్‌గా ఉపయోగించవచ్చు. పాలకూర సూప్ అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా మంచిది. ఉదయం ఖాళీ కడుపుతో పాలకూర రసం తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఆలు-పాలక్ లేదా పప్పు, పాలక్ వంటి వంటకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పాలకూర వల్ల ఇతర ప్రయోజనాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది, ఎముకలు, కళ్ళకు చాలా మంచిది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మందులతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం. పాలకూర వంటి సాధారణమైన, సులభంగా లభించే కూరగాయ రక్తపోటును సమతుల్యం చేయడమే కాకుండా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో పాలకూరను తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ ఐదు లక్షణాలు మీ కాలేయాన్ని దెబ్బతీయొచ్చు.. నిర్లక్ష్యం వద్దు!!

Advertisment
తాజా కథనాలు