/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu Photograph: (Live News Updates in Telugu)
Pakistan: టెర్రరిజంలో పాకిస్తాన్ 2వ స్థానంలో...భారత్ 14వ స్థానంలో...
టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది.
/rtv/media/media_files/2025/03/06/SebEgBJJ1uSjxWTYyrLi.jpg)
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్...గ్లోబల్ టెర్రరిజంపై తాజాగా నివేదిక ప్రచురించింది. దీనిలో ప్రపంచ వ్యాప్తంగా 163 దేశాలపై టెర్రరిజం ప్రభావాన్ని వివరించింది. ఉగ్రవాద ఘటనల సంఖ్య, ప్రాణనష్టం, గాయాలు, బందీలు, ఉగ్రవాదంపై ప్రభావం వంటి సూచికల ద్వారా ఈ సర్వేని చేసింది ఐఈపీ. ఈ సర్వే లో అన్నింటి కంటే ఆఫ్రికాలోని బుర్కినాఫాసోలో టెర్రరిజం అందరి కంటే ఎక్కువగా ఉందని చెప్పింది. దీని తరువాత స్థానంలో పాకిస్తాన్ ఉండగా..మూడవ ప్లేస్ లో సిరియా ఉంది.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి..
పాకిస్తాన్ లో ఈ మధ్య ఉగ్రవాద దాడులు బాగా పెరిగాయి. దాంతో పాటూ అక్కడ చనిపోతున్నవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. పాక్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. 2024లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు 45 శాతం భారీగా పెరిగాయని నివేదిక తెలిపింది. ఇక్కడ 52 శాతం మరణాలకు పాక్ తాలిబాన్లే కారణమని చెప్పింది. ముఖ్యంగా పాక్ లో ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే 96 శాతం ఉగ్రదాడులు, మరణాలు జరిగినట్లు సర్వే తేల్చింది.
ఇక గ్లోబల్ టెర్రరిజ ఇండెక్స్ లో భారత్ 14 వస్థానంలో ఉంది. ఉగ్రవాదం అతి తక్కువగా ఉన్న దేశాల జాబితాలో డెన్మార్క్ దేశం ఉంది. ఇక ఇండియా పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 35వ స్థానంలో ఉండగా ...అగ్రరాజ్యం అమెరికా 34వ స్థానంలో ఉంది. మయన్మార్ 11వ స్థానంలో ఉంది. అనూహ్యంగా ఇరాక్, ఇరాన్, పాలస్తీనా వంటి దేశాలు టాప్-10 జాబితాలో లేవు. టెర్రరిజం ఇండెక్స్ లో టాప్ 10 దేశాలుగా బుర్కినాఫాసో, పాకిస్తాన్, సిరియా, మాలి, నైజర్, నైజీరియా, సోమాలియా, ఇజ్రాయిల్, ఆఫ్ఘనిస్తాన్, కామెరూన్ ఉన్నాయి.
-
Mar 07, 2025 18:11 IST
హైదరాబాద్‌లోని ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు.. మీరే చూడండి!
-
Mar 07, 2025 18:10 IST
రేవంత్, కేసీఆర్‌కు స్టాలిన్ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా ?
-
Mar 07, 2025 18:03 IST
సర్కార్ గుడ్‌న్యూస్.. ఇక వారికి విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు..!
-
Mar 07, 2025 18:02 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం!
-
Mar 07, 2025 18:01 IST
సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా.. ఊహించని పరిణామంతో భట్టి జంప్!
-
Mar 07, 2025 17:03 IST
పోసానికి బెయిల్
-
Mar 07, 2025 16:10 IST
ఏపీలో క్వశ్చన్ పేపర్ లీక్!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
-
Mar 07, 2025 16:07 IST
తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
-
Mar 07, 2025 15:51 IST
ఎర్రవల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం.... కేసీఆర్ సంచలన నిర్ణయం
-
Mar 07, 2025 15:50 IST
దగ్గరుండి.. బెదిరించి.. కూతురుకు ఉరేయించి చంపిన తండ్రి.. పరువు హత్య కేసులో సంచలన విషయాలు!
-
Mar 07, 2025 15:49 IST
ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్.. మంత్రి పదవిపై బిగ్ ట్విస్ట్?
-
Mar 07, 2025 13:46 IST
IPL Tickets 2025: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ధరెంతంటే..?
-
Mar 07, 2025 07:03 IST
TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం
-
Mar 07, 2025 06:58 IST
Flight: విమానంలో టాయిలెట్‌లలో సమస్య.. చివరికి
-
Mar 07, 2025 06:57 IST
AP: ఆ షేర్ల బదిలీని రద్దు చేయండి..ఎన్సీఎల్టీలో జగన్ పిటిషన్