Hyd Hotels: హైదరాబాద్‌లోని ఆ ఫేమస్ హోటళ్లలో బొద్దింకలు, ఎలుకలు.. మీరే చూడండి!

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ తాజా కిచెన్, టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిల్వ ఉంచిన పదార్థాల దగ్గర బొద్దింకలు, ఎలుకలు, పాడైన కూరగాయలను అధికారులు గుర్తించారు. ఇలాంటి ఫుడ్స్ తింటే అనారోగ్య సమస్యల బారిన పడతారు.

New Update
Taja Kitchen

Taja Kitchen Photograph: (Taja Kitchen)

ఇంట్లో కంటే బయట ఫుడ్ తినడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అయితే బిర్యానీ (Biryani) వంటి వాటిని బయటే ఎక్కువగా తింటారు. అందులోనూ బాగా ఫేమస్ రెస్టారెంట్లు, హోటల్స్‌లో అయితే శుభ్రంగా చేస్తారని వీటిలో తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఇలాంటి హోటల్స్‌లో ఎలుకలు, బొద్దింకల మధ్య ఫుడ్ తయారు చేస్తున్నారు. ఏదో ఒక రెస్టారెంట్‌లోనే కాదు.. అమీర్‌పేట్‌లో ఉన్న తాజా కిచెన్ (Taza Kitchen), టోలిచౌకిలోని అమోఘ్ హోటల్స్‌ (Amogha Hotels) లోనూ ఇదే పరిస్థితి.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

పేర్లలో మాత్రమే తాాజా..

తాజా కిచెన్, అమోఘ్ అని వాటి పేర్లలో మాత్రమే ఉన్నాయని, వంటల్లో లేవని ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాల్లో తేలింది. కిచెన్ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, బొద్దింకలు, ఎలుకల తిరగడం, పాడైన కూరగాయలు, తుప్పు పట్టిన కత్తులు, సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బయటకు శుభ్రంగా కనిపిస్తాయని వీటిని లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడతారని అధికారులు హెచ్చరించారు. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

ఇది కూడా చూడండి:సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు