IPL Tickets 2025: ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ధరెంతంటే..?

ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ప్రైజ్ రూ. 400 నుండి రూ. 50,000+ వరకు నిర్ణయించారు. ఈ టిక్కెట్ బుకింగ్‌లను BookMyShow, Paytm Insider ద్వారా లేదా స్టేడియం వద్ద కొనుగోలు చేయవచ్చు. IPL 2025 సీజన్ మార్చి 22 నుండి మే 26, 2025 వరకు జరగనుంది.

New Update
IPL Tickets 2025

IPL Tickets 2025

IPL Tickets 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు టిక్కెట్ల విక్రయాలు  ప్రారంభమయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ మార్చి 22, 2025న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదటి మ్యాచ్ ఆడనుంది.

Also Read:DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

IPL ఫ్యాన్స్అ, క్రికెట్ లవర్స్ తమ టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా లేదా స్టేడియం బాక్సాఫీస్‌ లలో కొనుగోలు చేయవచ్చు. BookMyShow, Paytm వంటి అధికారిక టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో టిక్కెట్లను చాలా ఈజీగా కొనుగోలు చేయవచ్చు.

టిక్కెట్ల ధరలు వేదిక, సీటింగ్ కేటగిరీ, మ్యాచ్ ను బట్టి మారతాయి. జనరల్ సీట్లు రూ. 800 నుండి రూ. 1,500, ప్రీమియం సీట్లు రూ. 2,000 నుండి రూ. 5,000, VIP/ఎగ్జిక్యూటివ్ బాక్స్‌లు రూ. 6,000 నుండి రూ. 20,000 వరకు ఉంటాయి.

IPL 2025 టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?

1. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు.
   - BookMyShow
   - Paytm
   - IPLT20.com
   - Insider.in

2. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ఇలా చేయండి.
   - టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లండి (BookMyShow, Paytm, IPLT20.com etc).
   - మీరు వెళ్లాలనుకున్న మ్యాచ్‌ను ఎంచుకోండి.
   - సీటింగ్ కేటగిరీని (జనరల్ నుండి VIP వరకు) ఎంచుకోండి.
   - మీ వ్యక్తిగత వివరాలు (పేరు, ఇమెయిల్, ఫోన్ నంబర్) ఎంటర్ చేయండి.
   -  డెబిట్/క్రెడిట్ కార్డు, UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తిచేయండి.
   - టికెట్ వివరాలతో నిర్ధారణ ఇమెయిల్ లేదా SMS‌ పొందండి.

Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!

ప్రధాన మ్యాచ్‌లు, వేదికలు:  

మ్యాచ్ 1: కోల్‌కతా నైట్ రైడర్స్ vs  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - మార్చి 22, 2025. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో
మ్యాచ్ 2: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - మార్చి 23, 2025, రాజీవ్ గాంధీ స్టేడియం, హైదరాబాద్.  
మ్యాచ్ 3: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - మార్చి 23, 2025, ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై.  
మ్యాచ్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - మార్చి 24, 2025, అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ.  
మ్యాచ్ 5: గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ - మార్చి 25, 2025, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్.  

Also Read:ఒరేయ్ ఇదేం పనిరా.. పెళ్లాం ముందే నిద్రిస్తున్న మరో యువకుడి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.. ఛీ ఛీ!

Advertisment
తాజా కథనాలు