Amit shah: తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో హిందీ భాషా వివాదం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. భాషా విషయంలో స్టాలిన్ రాజకీయం చేయడం సరైంది కాదన్నారు.

New Update
Amit Shah

Amit Shah

తమిళనాడులో హిందీ భాషా వివాదం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం స్టాలిన్, కేంద్ర మంత్రులు ఒకరినొకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రం హోం మంత్రి అమిత్ షా తాజాగా స్పందించారు. తమిళ భాషకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. భాషా విషయంలో స్టాలిన్ రాజకీయం చేయడం సరైంది కాదన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అమిత్‌ షా రాణిపేటలో పర్యటించారు. సీఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 

Also Read: ఆ తుపానుకు అదుపులో ఉండమని చెప్పండి.. సీఎం రేఖాగుప్తా కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా అమిత్‌ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఇంజనీరింగ్, మెడికల్‌ కోర్సుల్లో ఉన్నత విద్య కోసం తమిళ భాషలోనే సిలబస్‌ను తీసుకొస్తాం. ఇందుకోసం వెంటనే చర్యలు చేపడతాం. తమిళ భాష సంస్కృతికి, అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. దేశంలోని ప్రాంతీయ భాషలను మేము గౌరవిస్తాం. ఇప్పటిదాకా సీఏపీఎఫ్‌ నియామకంలో చూసుకుంటే మాతృభాషకు స్థానం లేదు. దూనివల్ల యువతకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని భాషలతో పాటు తమిళ భాషలో కూడా సీఏపీఎఫ్‌ పరీక్షలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. స్టాలిన్ ఇకనుంచైనా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకోవాలని'' అమిత్ షా అన్నారు. 

ఇదిలాఉండగా.. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంపై స్టాలిన్ మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవలేని యుద్ధాన్ని ప్రారంభించారని అన్నారు. ''చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నప్పటికీ గాలి రాకుండా ఉండలేదు కదా. అలాగే భాష విషయంలో కూడా ఆయన మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇందుకోసమే మేము వరుసగా లేఖలు రాస్తున్నాం. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరిస్తున్న తమిళనాడు.. ఇప్పటికే విద్యావిధానంలో అనేక లక్ష్యాలు సాధించింది. 

Also Read: తాళీ, బొట్టు ఉంటేనే భర్తలకు మూడొస్తుంది.. ఆ కేసులో జడ్జీ సంచలన కామెంట్స్!

 త్రిభాషా అశంలో ఎల్‌కేజీ విద్యార్థి పీహెచ్‌డీ హోల్డర్‌కి ఆయన ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది.  దీనిపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయాన్ని సవాలుగా తీసుకొని బరిలోకి దిగాలి. పథకాల దగ్గర నుంచి చూసుకుంటే కేంద్ర సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ కూడా హిందీ పేర్లను పెట్టారని'' సీఎం స్టాలిన్ అన్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు