/rtv/media/media_files/2025/03/07/iwv9MygQTThIt31hY364.jpg)
Nagababu MLC Nomination
ఎమ్మెల్యే కోటా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు కొద్దిసేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్!
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు
— RTV (@RTVnewsnetwork) March 7, 2025
ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్,… pic.twitter.com/waHyCkJvL4
మంత్రి పదవి తీసుకుంటారా?
ఇదిలా ఉంటే.. నాగబాబు మంత్రి అవుతారా? లేదా? అన్న అంశం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన వెంటనే మంత్రివర్గంలోకి రావడం పక్కా అన్న ప్రచారం సాగింది.
ఇది కూడా చదవండి: Free Bus Ride : ఏపీ మహిళలకు బిగ్ షాక్..ఫ్రీ బస్ బంద్
అయితే.. మంత్రి పదవి చేపట్టేందుకు నాగబాబు ఆసక్తి చూపడం లేదని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అసలు రాజ్యసభకు వెళ్తాన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేస్తూ జనసేన అధికార ప్రకటన విడుదల చేయడంతో రాజ్యసభ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే.. మంత్రి పదవిపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడ లేదు. మరికొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.