CM Stalin: రేవంత్‌, కేసీఆర్‌కు స్టాలిన్‌ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా ?

సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు.

New Update
CM Revath, KCR and CM Stalin

CM Revath, KCR and CM Stalin

ప్రస్తుతం డీలిమిటేషన్ (De-Limitations) అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌ (CM Stalin) దీనిపై మరింత పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏడు రాష్ట్రాల సీఎంలకు ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. ఇటీవల స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో తీర్మానం ఆధారంగా ఆయన లేఖలు రాశారు.   

Also Read :  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఆ డ్యాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోండి!

మార్చి 22న చెన్నైలో జరగనున్న జాయింట్ యాక్షన్‌ కమిటీ సమావేశానికి హాజరుకావాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ రాష్ట్రాల సీఎంలకు ఆయన ఈ లేఖలు పంపించారు. అలాగే ఈ ఏడు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు, అధికార, విపక్ష నేతలను కూడా ఆయన ఆహ్వానించారు. డీలిమిటేషన్ అనేది సమాఖ్యవాదంపై చేస్తున్న దాడి అని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. జనాభాను నియంత్రించి, మంచి పాలన అందిస్తున్న రాష్ట్రాలకు పార్లమెంటులో హక్కులను దూరం చేసి శిక్షించడమేనని మండిపడ్డారు. వేరు వేరు రాజకీయ పార్టీలుగా కాకుండా.. మన ప్రజల భవిష్యత్తు కోసం మనమందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

Stalin Writes Letter To 7 CM's On De-Limitation

Also Read :  సీఎం కేసీఆర్.. రేవంత్ పేరు మళ్లీ మర్చిపోయిన మంత్రి పొన్నం, ఎమ్మెల్యే రాందాస్!

Also Read: తమిళ భాషకు గుర్తింపు ఇస్తాం.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

ఇదిలాఉండగా.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియను 2026లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పాటించే జనాభా ప్రాతిపాదికన నియమం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ లోక్‌సభ స్థానాలు వస్తాయని.. అధిక జనాభా కలిగిన యూపీ, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు వస్తాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఒకవేళ ఇలా జరిగితే కేంద్ర ప్రభుత్వం (Union Government) నుంచి తమకు రావాల్సిన నిధుల కోసం దక్షిణాది రాష్ట్రాలకు డిమాండ్ చేసే అధికారం తగ్గిపోతుందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ఉత్తర, దక్షిణ విభేదాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే డీలిమిటేషన్‌పై డీఎంకే పార్టీ కేంద్రంతో పోరాటం చేస్తోంది. 

Also Read: 'మ్యాథ్స్‌ ఇస్లాం ద్వారా వచ్చింది''.. మరో వివాదంలో షామా మొహమ్మద్

1971 జనాభా లెక్కల ఆధారంగానే లోక్‌సభ, రాజ్యసభల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన సవరణలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. డీలిమిటేషన్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఇటీవల స్పందించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన కాకుండా దేశానికి రాష్ట్రాలు అందించే జీపీడీ ఆధారంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు