BIG BREAKING: సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా.. ఊహించని పరిణామంతో భట్టి జంప్!

పెండింగ్ బిల్లులను చెల్లించాలంటూ తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ఆందోళన చేయడం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టిని కలిసేందుకు వచ్చిన దాదాపు 200 మంది కాంట్రాక్టర్లను సిబ్బంది అనుమతించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు.

New Update
Deputy CM Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka

 తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఊహించని పరిణామం ఎదురైంది. బిల్లులు క్లియర్ చేయాలని ఆయన ఛాంబర్ ముందు కాంట్రాక్టర్ల ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. భట్టీ విక్రమార్కతో భేటీ అయ్యేందుకు వివిధ జిల్లాల దాదాపు 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు.

అయితే.. వారిని ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ల ఆందోళనతో సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోయిన భట్టి విక్రమార్క వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు బిల్లులు క్లియర్ కావాలంటే 20 శాతం కమిషన్ అడుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. కాంట్రాక్టర్ల ఆందోళనపై ప్రభుత్వ వర్గాలు ఇంతవరకు స్పందించలేదు. ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం 20 శాతం కమిషన్లు డిమాండ్ చేయడమే ఈ పరిస్థితికి కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు