This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

మహాశివరాత్రి సందర్భంగా ఈ వారం పలు చిత్రాలు థియేటర్ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మజాకా, అగాథియా, శబ్దం, తకిట తదిమి తందాన చిత్రాలు థియేటర్ లో విడుదల కానుండగా.. సుడల్‌2 , సూపర్‌ బాయ్స్‌ ఆప్‌ మాలేగావ్‌ సినిమాలు ఓటీటీలో అలరించనున్నాయి.

New Update
this week ott movies

this week ott movies

This Week Movies:  ఈ వారం థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు సినిమాలు, సీరీస్ లు సిద్ధమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్ థియేటర్, ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలేంటో ఇక్కడ తెలుసుకోండి. 

శబ్దం

ఆది పినిశెట్టి హీరోగా అరివళగన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'శబ్దం'. సూపర్ హిట్ ఫిల్మ్  'వైశాలి' తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, లక్ష్మీ మేనన్‌  తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

అగాథియా

హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన  'అగాథియా: ఏంజిల్స్‌ vs డెవిల్‌’ చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో రాశీ కన్నా కథానాయికగా.. హీరో అర్జున్ పాత్రలో కనిపించనున్నారు.  పా.విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

మజాకా

సందీప్ కిషన్, రావు రమేష్, అన్షు, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్  'మజాకా'. ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇందులో సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రీకొడుకులుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వీరిద్దరి ప్రేమ కథలతో సాగే సరదా సన్నివేశాలు నవ్వులు పూయించాయి.  

 'తకిట తదిమి తందాన'

రాజ్‌ లోహిత్‌ లోహిత్ దర్శకత్వంలో ఆదిత్య, ప్రియ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ  'తకిట తదిమి తందాన'. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎల్లో మ్యాంగో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై చందన్‌ కుమార్‌ కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మించారు. 

పట్టుదల 

అజిత్- త్రిష జంటగా మాగిజ్‌ తిరుమనేని తెరకెక్కించిన లేటెస్ట్ తమిళ విదాముయార్చి. తెలుగులో  'పట్టుదల'  అనే పేరుతో రిలీజయింది. ఈ చిత్రం మార్చి 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 

అమెజాన్ ప్రైమ్ 

  • సూపర్‌ బాయ్స్‌ ఆప్‌ మాలేగావ్‌ : ఫిబ్రవరి 28
  • సుడల్‌2 : ఫిబ్రవరి 28
  • హౌస్‌ ఆఫ్‌ డేవిడ్‌: ఫిబ్రవరి 28

నెట్ ఫ్లిక్స్ 

డబ్బా కార్టెల్‌:  ఫిబ్రవరి 28

జియో హాట్‌స్టార్‌

  • లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌: ఫిబ్రవరి 28
  • ది వాస్ప్‌:  ఫిబ్రవరి 28
  • సూట్స్‌: ఫిబ్రవరి 24
  • బీటిల్‌ జ్యూస్‌:  ఫిబ్రవరి 28

Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు