BC reservation : సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఇక వారికి విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు..!

తెలంగాణ బీసీలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల హామీ మేరకు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

New Update
 BC reservation in jobs

BC reservation in jobs

 BC reservation :తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రేవంత్ సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మొత్తం మీదా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన హామీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా బీసీ కులగణన చేపట్టడంతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టంలో మార్పులు తేవాలని కేంద్రానికి పంపింది. కాగా ఈ విషయం ఇంకా తేలకపోయినప్పటికీ తెలంగాణ బీసీలకు మాత్రం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఇచ్చిన సవరణ నివేదికను మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

 Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో బీసీ కులగణన, రిజర్వేషన్‌ అంశాలపై మంత్రివర్గం చర్చించింది. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకురాగా దానికి అమోదం తెలిపారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలకు వేర్వేరు బిల్లులకు తీర్మానం చేయాలని నిర్ణయించింది. గతంలో బీసీ రిజర్వేషన్లను 37 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని వెనక్కు తీసుకోనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేంద్రం వద్ద ఈ తీర్మానం పెండింగ్ లో ఉన్నందున మరో తీర్మానం పంపడం కుదరదు కనుక పాత తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది.

Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్

కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పినట్లు బలహీనవర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని తీసుకువచ్చి.. అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రులు అంటున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల అమలుకు రెండు వేర్వేరు తీర్మానాలు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్

అలాగే ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా రాబోయే అసెంబ్లీలో చట్టం తేవాలని నిర్ణయించామని, ఆ మేరకు ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపామని అన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక పాలసీ ఉండాలని తెలంగాణ పర్యాటక విధానం 2025-30ను ఆమోదించామన్నారు. దీని కింద రాష్ట్రంలోని 27 ప్రత్యేక కేంద్రాలను అభివృద్ధి చేసి, ఐదేళ్లలో రూ.15 వేల కోట్లకు తగ్గకుండా పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు వచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 2024 పారాలింపిక్స్‌ కాంస్య పతక విజేత దీప్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.  

Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు