/rtv/media/media_files/2025/04/18/xA1hfHFnXU7vfDyC1siP.jpg)
IPPB
బ్యాంకు ఉద్యోగం కోసం ట్రై చేసే వారికి ఇది సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే IPPBలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేకుండానే సెలక్ట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరితేదీ. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ వంటి ముఖ్యమైన పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే వారికి నేడు చివరి తేదీ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ఇది కూడా చూడండి: AP: వైఎస్ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్
తప్పకుండా పని అనుభవం..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేట్, సీఏ లేదా ఎమ్‌బీఏ ఫైనాన్స్ పూర్తి చేసి ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా 18 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. ఇక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవికి కూడా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్లు అయి ఉండాలి.
ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం
అదనంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు లేదా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థ నుండి పదవీ విరమణ చేసిన లేదా డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేస్తున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. వీటికి వయస్సు కూడా 38 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!
అదే సమయంలో అంతర్గత అంబుడ్స్‌మన్ పదవికి అభ్యర్థి వయస్సు 65 సంవత్సరాలకు మించకూడదు. ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ఆన్‌లైన్ టెస్ట్ వంటి ప్రక్రియల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవీకాలం 3 సంవత్సరాలు. దీనిని ఇంకా రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇంటర్నల్ అంబుడ్స్‌మన్ పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుంది.
ఇది కూడా చూడండి: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
jobs | bank-jobs | india post payments bank | job-notification | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | national news in Telugu