🔴Live Breakings: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా బాంబులతో విరుచుకుపడుతున్నప్రస్తుత సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం మీద తీవ్ర ప్రభావం చూపనుంది.
ఇప్పటివరకు ఇరాన్‌కు మద్దతు పలికిన హెజ్బొల్లా ఉగ్రసంస్థ యూటర్న్ తీసుకుంది. ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగిన నేపథ్యంలో అటు ఇజ్రాయెల్‌పై గానీ, అమెరికా పైగానీ దాడులు చేయమని స్పష్టం చేసింది.
ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.
నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కాగా ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా ఆదివారం ప్రత్యక్ష దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే ఛాన్స్ ఉందనే అనుమానంతో అమెరికా హైఅలర్ట్ ప్రకటించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయాలని మోదీ కోరారు.
ప్రస్తుతం టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడులు చేస్తుండటంతో ఖమేనీ భద్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఆయన ఉండే ప్రదేశంలో ఎలాంటి సిగ్నళ్లు అందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లను పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం.
ఇజ్రాయిల్‌తో యుద్ధం కారణంగా ఆదివారం ఇరాన్ గగనతలం మూసివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా రన్‌వే నెం.2పై విమానం టేకాఫ్ కాకుండా ఉంది.