Indonesia: ఇండోనేషియాలో పేలుళ్లు..54 మంది..

ఇండోనేషియా రాజధాని జకార్తాను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. స్కూలు, మసీదుల్లో ఒకేసారి బాంబులు పేలాయి. ఇందులో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తి 17 ఏళ్ళ బాలుడిగా గుర్తించారు.

New Update
indonesia

జకార్తాలోని ఉత్తర కెలాపాగాడింగ్ పరిసరాల్లోని నేవీ కాంపౌండ్‌లోని స్టేట్ హైస్కూల్... దాని దగ్గరలోనే ఉన్న మసీదు లోపల, బయట బాంబు పేలుళ్లు(bomb-explosion) సంభవించాయి. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో రెండు సార్లు వెంట వెంటనే పెద్ద పేలుళ్లు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు. మంటలు, దట్టమైన పొగతో మసీదు నిండిపోయింది. దీంతో భయాందోళనలకు గురైన విద్యార్థులు, ఇతర స్టాఫ్ బయటకు పరుగులు తీశారు. ఈఘటనలో మొత్తం 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులే ఉన్నారు.

Also Read:  అమ్మకానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అంతా సిద్ధం!

ఉగ్రదాడి కాదు..

బాంబు పేలుళ్లకు కారణమైన ఓ 17 బాలుడిని జకార్తా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఒక బొమ్మ సబ్ మెషిన్ గన్‌ స్వాధీనం చేసుకున్నామని...దానిపై నినాదాలు రాసి ఉన్నాయని తెలిపారు. పేలుళ్లు ఉగ్రవాద దాడులు కాదని స్పష్టం చేశారు. ఘటనలో అనుమానితుడు సైతం గాయపడ్డాడు. అయితే అతను ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డాడనేది మాత్రం ఇంకా వివరాలు తెలియలేదు. పేలుళ్ళల్లో అనుమానితుడు కూడా తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడి గుర్తింపు, అతను నివసించే వాతావరణం, అతని ఇల్లు , ఇతర ప్రాంతాలను గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుళ్లకు దేనిని ఉపయోగించారు అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: Pak-Afghan: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి చర్చలు మళ్ళీ విఫలం

Advertisment
తాజా కథనాలు