/rtv/media/media_files/2025/11/07/trump-to-blame-for-mamdani-victory-2025-11-07-21-08-02.jpg)
Trump to blame for Mamdani victory
ఇటీవల అమెరికాలో న్యూయార్క్, వర్జీనియాలో జరిగిన ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ లీడర్ జోహ్రన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో కూడా ట్రంప్ నేతృత్వంలో రిపబ్లికన్ పార్టీ పరాజయం పొందింది. అక్కడ కూడా డెమోక్రట్ మహిళా నేత గజాలా హష్మీ.. వర్జీనియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
Also Read: అంతరిక్షంలో అద్భుతం.. స్పేస్ స్టేషన్‌లో వంట చేసిన వ్యోమగాములు
ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడంతో ట్రంప్ పట్ల తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. ట్రంప్ మద్దతుదారులే ఈ ఎన్నికల ఫలితాలపై మండిపడుతున్నారు. ట్రంప్ వల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయామంటూ మాగా (Make America Great Again) శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నారు. ట్రంప్ విదేశీ రాజకీయాలపై ఫోకస్ పెట్టి అమెరికాలో ఉన్న ప్రధాన సమస్యలను విస్మరించాడని ఆరోపిస్తున్నారు. అందుకే ఎన్నికల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శిస్తున్నారు. రిపబ్లికన్ల అంతర్గత కలహాలు కూడా ఓటమికి ఒక కారణమని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టెస్లాలో మస్క్ కు వన్ ట్రిలియన్ ప్యాకేజ్..ఆనందంతో రోబోతో ఎలాన్ డాన్స్
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి అలాగే ట్రంప్ ప్రచార రాజకీయ డైరెక్టర్ జేమ్స్ బ్లెయిర్ కూడా ట్రంప్ దేశీయ సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే ఓటమి వచ్చిందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటినుంచైనా ట్రంప్ ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలపై ఎక్కువ దృష్టి సారించకుంజా ముందుగా అమెరికన్ ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టాలని సూచనలు చేస్తున్నారు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మధ్యంతర ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీ ఓడిపోతుందని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: తెలంగాణలో రేపటి నుంచి తెరుచుకోనున్న ప్రైవేటు కళాశాలలు..
Follow Us