/rtv/media/media_files/2025/04/25/oF311lG2OOjKVPLWnAhr.jpg)
Pakistan Defence Minister Khwaja Asif
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్(pak afghan news) ల మధ్య మళ్ళీ శాంతి చర్చలు విఫలం అయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో జరిగిన తాజా రౌండ్ చర్చలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని భావించారు.. కానీ ఆఫ్ఘన్తాలిబన్ ప్రతినిధి బృందం ఎటువంటి వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడంతో..చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. మరోవైపు సరిహద్దుల్లో దాడులు కొనసాగితే తమ నుంచి ప్రతిస్పందన దారుణంగా ఉంటుందని ఖ్వాజా హెచ్చరించారు.
#BreakingNews | Peace Talks With Afghanistan Have Failed, Taliban Refusing Written Guarantees: Pakistan Defence Minister #Exclusive Inputs: @manojkumargupta@akankshaswarups Shares More Details
— News18 (@CNNnews18) November 7, 2025
Maj Gen (R) AK Siwach Shares His Views#Pakistan#Afghanistan | @JamwalNews18pic.twitter.com/dR3Kn2BMvk
Also Read : మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్
బహిరంగ యుద్ధం తప్పదు..
అంతకు ముందు రెండు రోజుల క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్..ఆఫ్ఘాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి శాంతి శాంతి చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్, పాకిస్తాన్ ప్రతినిధులు టర్కీలో సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు ఖ్వాజా హెచ్చరికలు జారీ చేశారు. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. తాజాగా జరిగిన చర్చల్లో సరిహద్దు ఘర్షణలు, డ్రోన్ దాడులు, పాకిస్తాన్ వాణిజ్య క్రాసింగ్ లను మూసివేయడం లాంటి అంశాలపై రెండు దేశాలు ఒక అంగీకారానికి రాలేదని తెలుస్తోంది. పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. అందుకే డ్రోన్ దాడులు చేపట్టామని సమర్థించుకుంటోంది. ఆఫ్ఘాన్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పి కొడుతోంది. ఇప్పుడు శాంతి చర్చలు విఫలం అవ్వడంతో మళ్ళీ సరిహద్దుల్లో భారీ దాడులు జరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
Khawaja Asif's "War" Threat To Taliban Before Afghan-Pak Peace Talks in Turkey . Report : @AdityaRajKaul .
— Najib Farhodi (@Najib_Farhodi) November 6, 2025
YES : A war threat on the eve of peace talks shows Islamabad’s political weakness; those who truly seek peace do not enter negotiations with threats.…
Also Read: Samantha : ఈ ఒక్క ఫొటో చాలు బాబోయ్!... రాజ్‌కు సమంత హగ్.. త్వరలోనే పెళ్లి!
Follow Us