/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t093233490-2025-11-08-09-33-03.jpg)
We are boycotting the G-20 summit: Trump's sensational statement
అమెరికా(america) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరూ చెప్పలేం. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా(south-africa) లో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్(Boycott G-20 Summit) చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అంతేకాదు జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అయితే, ఇందుకు గల కారణాలను కూడా ట్రంప్ వెల్లడించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు పెరిగిపోతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాల్సి ఉంది. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఏ ఒక్కరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Boycott G-20 Summit - Trump
అయితే, ఇటీవల మియామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో చేసిన ప్రసంగంలోనూ దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించడం గమనార్హం. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం రక్షణ చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.\
Also Read: ఎంపీకి బురుడి.. రూ.56 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
అయితే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని తేల్చి చెప్పింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తప్పుడు సమాచారం అందినట్లు తెలపడం విశేషం.
ఇది కూడా చూడండి: Wine shops : మందుబాబులకు బిగ్ షాక్.. 4 రోజులు వైన్ షాపులు బంద్
కాగా, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-,23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే తొలిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు.
Also Read: కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us