/rtv/media/media_files/2025/11/08/mamdani-2025-11-08-10-02-38.jpg)
Zohran Mamdani
జోహ్రాన్మామ్దానీ..న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన ఇతను పెద్ద సంచలనమే సృష్టించాడు. ఇతను భారత మూలాలు ఉన్న వ్యక్తి. ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. హిందీ బాగా మాట్లాడతారు. ఒడియా కూడా మాట్లాడగలరు. మంచి వక్త అని చెబుతున్నారు. జోహ్రాన్ దాదాపు 49 శాతం ఓట్ల మెజార్టీతో న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలిచారు. దీంతో పాటూ న్యూయార్క్ కు ఎన్నికైన మొదటి ముస్లిం, ఏషియన్ మేయర్ గా కూడా మామ్దానీ చరిత్ర సృష్టించారు. అదొక్కటే కాదు అతి చిన్న వయసు మేయర్ గా కూడా ఈయన రికార్డ్ సాధించారు.
కోట్లు కుమ్మరించారు..
అయితే జోహ్రాన్ గెలవకూడదని చాలా మంది కోరుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ నుంచి రిపబ్లికన్లు, న్యూయార్క్ ధనవంతులతో సహా అందరూ అతను గెలవకూడదని ప్రయత్నాలు చేశారు. ఫోర్బ్స్ప్రకారం.. కనీసం 26 మంది బిలియనీర్లు, ధనవంతుల కుటుంబాలు మొత్తం 220 మిలియన్ డాలర్లు జోహ్రాన్ కు వ్యతిరేకంగా ఖర్చు పెట్టారు. మమ్దానీకి వ్యతిరేకంగా ప్రకటనలు, ఆయన ప్రత్యర్థుల మద్దతుకోసం ఖర్చుచేశారు. వీరిలో బ్లూమ్‌బర్గ్ఎల్‌పీ కో-ఫౌండర్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్, హెడ్జ్ ఫండ్ మేనేజర్ బిల్ అక్మన్, ఎయిర్‌బిఎన్‌బీ సహ- వ్యవస్థాపకుడు జో గెబ్బియా, ఎస్తీలాడర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరందరూ రిపబ్లికన్ పార్టీ తరుఫున పోటీ చేసిన కువోమోకుమద్దుతు ఇచ్చిన స్వతంత్ర వ్యయ కమిటీలు, రాజకీయ యాక్షన్ కమిటీలకు కనీసం 100,000 డాలర్లు విరాళంగా కూడా అందించారు. కువోమో కోసం మైఖేల్ బ్లూమ్‌బర్గ్ ఏకంగా 8 మిలియన్ డాలర్లు (రూ.66 కోట్లు) ఖర్చు చేయగా.. అక్మన్ 1.75 లక్షల డాలర్లు, లాడర్ 7.5 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. వీటిల్లోఫిక్స్ ది సిటీ, ఇంక్’ మైఖేల్ బ్లూమ్‌బర్గ్ ఇచ్చిన 8.3 మిలియన్ డాలర్లు విరాళం ఎన్నికలకు ముందు అందిన విరాళాల్లో అతి ముఖ్యమైందని బ్లూమ్ బెర్గ్ చెబుతోంది. ఇతర ప్రముఖ దాతల్లో నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాస్టింగ్స్, మీడియా అధినేత బ్యారీడిల్లర్ కూడా ఉన్నారు.
మమ్దానీ ప్రత్యర్థులకు సహకరించిన బిలియనీర్లు
మైఖేల్ బ్లూమ్‌బర్గ్: 8.3 మిలియన్ డాలర్లు (రూ.69 కోట్లు)
జో గెబ్బా: 3 మిలియన్ డాలర్లు
విలియమ్ లాడర్ అండ్ ఫ్యామిలీ 2.6 మిలియన్ డాలర్లు
బిల్ అక్మన్: 1.75 మిలియన్ డాలర్లు
జొనాథన్ టిచ్ అండ్ ఫ్యామిలీ: 1.2 మిలియన్ డాలర్లు
జాన్ హెస్: మిలియన్ డాలర్లు
డానియల్ లోబ్: 775,000 డాలర్లు
బ్యారీడిల్లర్: 500000 డాలర్లు
స్టీవ్ వ్యాన్: 500000 డాలరలు.
మార్సెలలాగ్యురినోహైమోవిట్జ్: 400000 డాలర్లు
డేవిడ్ వాలెంట్స్: 350,000 డాలర్లు
రీడ్ హస్టింగ్స్: 250,000 డాలర్లు
జాన్: ఫిష్ 250,000 డాలర్లు
డేవిడ్ లిచ్టెస్టిన్: 250,000
అలీసావాల్టన్: 200000 డాలర్లు.
జెర్రీస్పేయర్: 150,000 డాలర్లు.
స్టెఫానీకోల్మన్: 150,000 డాలర్లు
డ్రస్ట్ ఫ్యామిలీ: 110,000 డాలర్లు
ఫిషర్ ఫ్యామిలీ: 110,000 డాలర్లు
డానిల్ఓచ్: 100000 డాలర్లు
కెన్లాంగోన్: 100000 డాలర్లు
జేమ్స్ అండ్ కాథర్యిన్ముర్దోక్: 100000 డాలర్లు
బ్రూస్ అండ్ సుజైకోవెనర్: 100000 డాలర్లు.
రిచర్డ్ కర్ట్జ్: 100000 డాలర్లు
ఎలగన్యన్ ఫ్యామిలీ: 100000 డాలర్లు.
ప్రజలే గెలిపించారు..
కానీ ఎవరేం చేసినా జోహ్రాన్మామ్దానీ గెలుపును మాత్రం ఆపలేకపోయారు. ఎన్నికల ప్రచారంలో జోహ్రాన్ చేసిన వాగ్దానాలే అతన్ని గెలిపించాయి. జొహ్రాన్(ZohranMamdani).. తాను ఎన్నికయితే అద్దెలను తగ్గిస్తానని, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తానని, నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశాడు. దాంతో పాటూ న్యూయార్క్ లోకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తానని సంచలన వాగ్దానం చేశారు. ఇజ్రాయెల్ వెలుపల అత్యధికంగా యూదులు నివసించేది న్యూయార్క్ లోనే. పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు ఇవ్వడమే కాక.. ఇజ్రాయెల్ పై తన కోపాన్ని కూడా ప్రదర్శించారు. ఇలా ఓ వైపు సామాన్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ నీతి వైపు గొంతెత్తి మాట్లాడడం వల్లనే ఇతను ప్రస్తుతం అక్కడ మేయర్ ఎన్నికల్లో ఫేవరెట్ కంటెస్టెంట్ గా అయ్యారు. ముఖ్యంగా అక్కడి యువతరానికి బాగా నచ్చారు. అతను ముస్లిం అనీ, జీహాదీఅని, అతను గెలిస్తే యూదులకు భధ్రతవుండదనీ ప్రత్యర్థులు ఎంతలా ప్రచారం చేసినా.. మత, జాతి తారతమ్యాలు లేకుండా యువత అతనికి మద్దతుగా పోటెత్తింది. అతనికి మద్దతుగా వేలమంది వాలంటీర్లు న్యూయార్క్ వీథుల్లో ప్రచారం చేశారు.
Also Read: Jaipur: స్కూల్లో వేధింపులే ఆత్మహత్యకు కారణం..జైపూర్ తొమ్మిదేళ్ల పాప అమైరా తల్లిదండ్రులు
Follow Us