Mark Zuckerberg: అనుమతి లేకుండా ఇంట్లో రహస్య స్కూల్..ఏంటి జుకర్ మామా ఈ పనులు..

మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్ వివాదాల్లో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా తన ఇంట్లో నాలుగేళ్ళుగా స్కూల్ నడపడం వివాదాలకు దారి తీసింది. ప్రస్తుతం ఈ స్కూల్ ను ఆయన ఇంటి నుంచి వేరే స్థలానికి మార్చారు. 

New Update
zukerberg

Mark Zuckerberg

కాలిఫోర్నియా(california) రాష్ట్రం పాలో ఆల్టో సిటీలోని తన ఇంట్లో మెటా అధిపతి మార్క్ జుకర్ బర్గ్(mark-zuckerberg)నాలుగేళ్ళుగా స్కూల్ నడుపుతున్నారు. దీని కోసం ఆయన ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పైగా రహస్యంగా స్కూల్ ను రన్ చేశారు. అయితే చుట్టుపక్కల ఉన్న వారు కంప్లైంట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తరువాత దీనిపై దుమారం రేగడంతో ఆ స్కూల్‌ను అధికారులు మూసివేయించాయని పేర్కొంటూ ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.

Also Read :  రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్ల స్కెచ్..అయినా జోహ్రాన్ గెలుపు..

నాలుగేళ్ళుగా రహస్యంగా..

జుకర్ బర్గ్ 2021లో బికెన్‌ బెన్‌ స్కూల్‌’ పేరుతో మాంటిస్సోరీ స్కూల్ ను ప్రారంభించారని తెలుస్తోంది. ఇందులో 30 నుంచి 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. అక్కడ పాఠశాల నిర్వహిస్తున్న విషయం ముందు ఎవరికీ తెలియదు. కానీ, ప్రతిరోజు ఉదయాన్నే ఆ వీధిలోకి వరుసగా కార్లు వచ్చి జుకర్‌బర్ట్ నివాసం వద్ద పిల్లలను దింపి వెళ్లడం చూసిన స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీయగా జుకర్ ఇంట్లో పూర్తి స్థాయిలో పాఠశాలను నిర్వహిస్తున్న విషయాన్ని వారు గ్రహించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరసనలకు దిగారు. మొత్తానికి 2024లో అధికారికంగా ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలు తీసుకోక తప్పలేదు.

ప్రస్తుతం జుకర్ ఇంట్లో ఉన్న స్కూల్ ను అధికారులు మూసి వేయించారు. పాఠశాలను మూసివేయాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఈ మార్చిలో జుకర్‌బర్గ్‌కు స్థానిక అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆగస్టులో స్కూల్ మూసివేస్తున్నట్టుజుకర్ అధికారికంగా ప్రకటించారు. అయితే స్కూల్ ను పూర్తిగా మూసివేయలేదని..దానిని ఇంకో చోటికి మార్చారని మెటా సంస్థ అధికారిక ప్రతినిధి బ్రియాన్‌ బేకర్‌ తెలిపారు. అయితే ఎక్కడకుతరలించారన్నది మాత్రం చెప్పలేదు. అసలు మెటా లేదా జుకర్ బర్గ్ ఎందుకు అంత రహస్యంగా స్కూల్ ను నడుపుతున్నారన్నది కూడా తెలియడం లేదు.

Also Read: USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్

Advertisment
తాజా కథనాలు