USA: వైట్ హౌస్ లో కళ్ళు తిరిగి పడిపోయిన వ్యక్తి..గంటసేపు ఆగిపోయిన ట్రంప్ మీటింగ్

వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కాసేపు గందరగోళం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. దీంతో కాసేపు అక్కడ హడావుడి జరిగింది.

New Update
Oval Office

వైట్ హౌస్ లో ఈరోజు బరువు తగ్గించే మందుల ధరల తగ్గింపుపై అధ్యక్షుడు ట్రంప్ మీటింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించి ఆయన ప్రకటనను జారీ చేశారు. ఈ మీటింగ్ కు ఫార్మాస్యూటికల్ కంపెనీల అధిపతులు, ప్రతినిధులు వచ్చారు. అయితే మీటింగ్ జరుగుతుండగా..ఒకఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రతినిధి ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. అతనికి సడెన్ గా తల తిరగడం వలన కళ్ళు తిరిగి పడిపోయారు. ఈ వ్యక్తి ట్రంప్ కు సమీపంగా కూర్చొన్నారు.

30 నిమిషాలు నిల్చోవడం వల్లనే..

పడిపోయిన వ్యక్తి ప్రస్తుతం బాగానే ఉన్నాడని చెబుతున్నారు. వైట్ హౌస్ అతనితో పాటూ అందరూ వెంటనే సహాయం చేయడంతో అతను కొద్దిసేపటిలోనే తేరుకున్నారు. అయితే మీటింగ్ సమయంలో ఫార్మా కంపెనీ ప్రతినిధులు 30 నిమిషాలపాటూనిల్చుని ఉన్నారని ..దాని కారణంగానే ఆ వ్యక్తి పడిపోయి ఉంటారని చెబుతున్నారు. ట్రంప్ సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ నిర్వాహకుడు మెహ్మెట్ఓజ్ ఆ వ్యక్తిని పరీక్షించి, అతను బాగానే ఉన్నాడని చెప్పారు. అయితే దీని కారణంగా అధ్యక్షుడు ట్రంప్ నిర్వహిస్తున్న కార్యక్రమం దాదాపు గంటసేపు ఆగిపోయింది.

Also Read: Zohran Mamdani: రూ.200 కోట్లు, 26 మంది బిలియనీర్ల స్కెచ్..అయినా జోహ్రాన్ గెలుపు..

Advertisment
తాజా కథనాలు