Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ట్రంప్, నెతన్యాహులపై 'ఫత్వా'
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3.33 గంటలకు కోల్‌కతాలోని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు.
తాజాగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ మరోసారి చర్చనీయాంశమైంది. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌ను రద్దు చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
రష్యా ఉక్రెయిన్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా శనివారం రాత్రి రష్యా అతిపెద్ద దాడి చేసింది. రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి అని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కోఫౌండర్ హకామ్ మహమ్మద్ ఇస్సా అల్-ఆస్సా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని సబ్రాలో జరిగిన వైమానిక దాడిలో హకామ్ మృతి చెందాడు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించి సంధి కుదుర్చుకోవాలని తన సోషల్ మీడియా అయిన ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ప్రస్తుతం హమాస్‌తో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.
రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయని తెలిసింది.
పాకిస్తాన్లో నేడు భారీ భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 3:54 గంటలకు ప్రకంపనలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది.