Putin: పుతిన్ ఆరోగ్య రహస్యం.. ఆయన ఏం తింటారో తెలుసా ?

పుతిన్‌కు ఫిట్‌నెస్‌ కోసం సరైన డైట్‌ను ఫాలో అవుతారు. అందుకే ఆయన 73 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తారు. మరి పుతిన్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Putin

Putin

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. గురువారం రాత్రి పుతిన్‌కు ప్రధాని మోదీ ప్రైవేటు విందు ఇవ్వనున్నారు. ఇక శుక్రవారం ఇరు దేశాధినేతలు ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అయితే పుతిన్‌కు ఫిట్‌నెస్‌ కోసం సరైన డైట్‌ను ఫాలో అవుతారు. అందుకే ఆయన 73 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తారు. మరి పుతిన్ ఎలాంటి ఆహారం తీసుకుంటారో గతంలో ఓసారి చెప్పారు కూడా. అంతేకాదు తినడానికి పెద్దగా సమయం కూడా దొరకదని చాలాసార్లు చెప్పారు. 

ఈయన ఫుడ్ దినచర్య చూసుకుంటే ఉదయం కాస్త ఆలస్యంగానే టిఫిన్ చేస్తారు. ఇందులో గంజి తప్పనిసరిగా ఉంటుంది. ఓట్స్‌ కాకుండా బియ్యం లేదా బక్‌వీట్‌తో చేసిన గంజినే ఆయన ఇష్టపడతారు.  అలాగే ఫ్రెష్ కాటేజ్ చీజ్‌, పచ్చి కోడిగుడ్డు, తేనేను తీసుకుంటారు. ముల్లంగి, బీట్‌రూట్ రసాన్ని కూడా తాగుతారని తెలుస్తోంది. 

Also Read: అమ్మో.. పుతిన్ ప్రయాణించే విమానానికి ఇంత సెక్యూరిటీ ఉంటుందా ! తెలిస్తే షాక్ అయిపోతారు

ఇక మధ్యాహ్నం లైట్‌ఫుడ్‌ను మాత్రమే తీసుకుంటారు. దోసకాయలు, లెట్యూస్, టమాటాలు వంటి తాజా కూరగాయలను మాత్రమే ఆయన తింటారు. చాలా సందర్భాల్లో రాత్రి భోజనం కూడా చేయరని సమాచారం. మాంసహారం విషయంలో చూసుకుంటే రెడ్‌మీట్‌ కన్నా చేపలనే ఎక్కువగా తీసుకంటారు. స్టర్జన్, సాల్మన్ లాంటి చేపలను ఇష్టంగా తింటారు. గొర్రె మాసం కూడా ఆయనకు ఇష్టమే. ఐస్‌క్రీమ్‌ కూడా తీసుకుంటారు. కానీ స్వీట్ పదార్థాలకు, నూనె వంటకాలకు మాత్రం చాలా దూరంగా ఉంటారు.  

మరో విషయం ఏంటంటే పుతిన్ ఎక్కడికి వెళ్లినా కూడా ఆయన వెంట ఓ మొబైల్ ల్యాబ్ ఉంటుంది. పుతిన్ తినే ప్రతి పదార్థాన్ని టెస్ట్ చేసిన తర్వాతే తినాల్సి ఉంటుంది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి హోటల్ నుంచి తెప్పించే ఫుడ్‌ను తీసుకోరు. రష్యా నుంచే సొంతంగా చెఫ్స్‌, వంట సామాగ్రి, సరకులు విమానంలో తీసుకొస్తారు. ఆయన బస చేసే ప్రదేశానికి ముందుగానే ఈ సరకులు వెళ్తాయి.  

Also Read: భార్యతో విడాకులు, ముగ్గురు అక్రమ సంతానం.. పుతిన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

అంతేకాదు విదేశీ గూఢచారులకు తన ఆరోగ్యం గురించి తెలియకుండా ఉండేందుకు పుతిన్‌ మలమూత్రాలను కూడా అక్కడి డ్రైనేజీలో కలవనివ్వరు. సెక్యూరిటీ సిబ్బంది వాటిని ప్రత్యేక ప్యాకెట్లలో సీల్‌ చేసి ఒక సూట్‌కేసులో రష్యాకు తీసుకెళ్తారని సమాచారం. 

Advertisment
తాజా కథనాలు