USA: అమెరికాలో ఉగ్ర కుట్ర..కారు నిండా తుపాకులతో పాక్ సంతతి వ్యక్తి

అమెరికాలో భారీ ఉగ్ర కుట్రను అక్కడిపోలీసులు భగ్నం చేశారు. డెలావేర్ లో ని యూనివర్శిటీ లక్ష్యంగా చేసుకుని కారు నిండి తుపాకులతో వెళుతున్న పాకిస్తాన్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
usa terror attack

అగ్రరాజ్యం అమెరికా అతి పెద్ద ఉగ్ర కుట్ర నుంచి బయటపడింది. డెలావేర్ లో పాకిస్తాన్ కు చెందిన లుఖ్మాన్ అనే వ్యక్తి కాల్పులకు రచన చేశాడు. 25 ఏళ్ళ వయసున్న ఇతను డెలావేర్ యూనివర్శిటీలో చదువుతున్నాడు. అతని కారులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు, దాడి ప్రణాళికతో కూడిన ‘మ్యానిఫెస్టో’ లభించాయని యూఎస్ న్యాయ శాఖ ప్రకటించింది.

కారు నిండా ఆయుధాలు..

యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్ విద్యార్థి అయిన లఖ్మాన్ ఖాన్ నవంబర్ 24న తన కారులో అనుమానాస్పదంగా కూర్చుని ఉండడాన్ని అక్కడి స్థానిక పోలీసులు గుర్తించారు. దీంతో అతని దగ్గరకు వెళ్లి విచారణ చేయగా మొత్తం విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు ఖాన్ కారును తనిఖీ చేశారు. 357 క్యాలిబర్గ్లాక్హ్యాండ్‌గన్స్, 27 రౌండ్లతో లోడ్ చేసిన మూడు అదనపు మ్యాగజైన్‌లు, 9ఎంఎం గ్లాక్మ్యాగజైన్, ఒక బాలిస్టిక్ ప్లేట్ , ఒక చేతితో రాసిన నోట్‌బుక్ లభించాయి. హ్యాండ్‌గన్‌కుమైక్రోప్లాస్టిక్కన్వర్షన్ కిట్ అమర్చబడి ఉంది. దీంతో ఆ గన్ సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌లా పని చేస్తుంది.

అమరుడవ్వడానికే..

కారులో నోట్ బుక్ లో లుఖ్మాన్ ఖాన్ దాడి ఎలా చేయాలనుకున్నాడో మొత్తం రాశాడు. దాడికి ఉపయోగించాలనుకున్న ఆయుధాలు, దాడి తరువాత ఎలా తప్పించుకోవాలి లాంటి విషయాలను క్లియర్ గా నోట్ చేసుకున్నాడు. ఈ నోట్ బుక్ లోనే అతని పేరు, ఎక్కడ చదువుకుంటున్నాడు లాంటి విషయాలు కూడా ఉన్నాయి. దీంతో పాటూ యూనివర్శిటీ ఆఫ్ డెలావేర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సభ్యుడి పేరు, అలాగే యు.డి. పోలీస్ స్టేషన్ లేఅవుట్, ప్రవేశ-నిష్క్రమణ పాయింట్లు కూడా ఉన్నాయి. అందరినీ చంపడం, మ్యానిఫెస్టో, మార్డిర్డమ్ లాంటి పదాలు కూడా ఉన్నాయి. వీటి గురించి ఖాన్ ను అడిగినప్పుడు దాడి చేస్తేనే అమరుడు అవుతానని..అందుకే ఇలాంటిది ప్లాన్ చేశానని పోలీసులకు చెప్పాడు. పక్కాగా దాడికి ప్రణాళిక రచించానని..అయితే చివరలో కంగారు పడడం వల్లనే దొరికిపోయానని తెలిపాడు.

లుఖ్మాన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్బీఐ అధికారులు విల్మింగ్టన్‌లోని అతని నివాసంలో సోదాలు నిర్వహించారు. ఖాన్ ఇంట్లో ఏఆర్-శైలి రైఫిల్, రెడ్-డాట్ స్కోప్‌తో అమర్చిన మరో గ్లాక్ పిస్టల్ లభించాయి. ఈ రెండో పిస్టల్‌కు ఒక అక్రమ పరికరం అమర్చబడి, అది నిమిషానికి 1,200 రౌండ్లను కాల్చగలిగే పూర్తి ఆటోమేటిక్ మెషిన్ గన్‌గా మార్చారు. వీటితో పాటూ మరో 11 బుల్లెట్ మ్యాగ్జైన్లు, అత్యంత ప్రమాదకరమైన హ్యాలోపయింట్ బుల్లెట్లు, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ కూడా లభించాయి. ఖాన్ దగ్గర లభించిన ఆయుధాలు ఏవీ రిజిస్టర్ అయి లేవు. అవి అమెరికాలో కొన్నవి కావని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లుఖ్మాన్ ఖాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనుక ఇంకెవరైనా ఉన్నారా...ఇంకెక్కడైనా దాడులకు ప్లాన్ చేశారా లాంటి విషయాలను ఎఫ్బీఐ ఆరా తీస్తోంది. లుఖ్మాన్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ లో పుట్టాడు. తర్వాత పాకిస్తాన్ కు శరణార్థులుగా వెళ్ళిపోయి..అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. 

Advertisment
తాజా కథనాలు