/rtv/media/media_files/2025/12/04/pia-2025-12-04-11-40-42.jpg)
పాకిస్తాన్ గత కొన్నేళ్ళుగాఆర్థికపరంగాసతమతమౌతోంది. బయటకు ఎక్కడా ఇది కనిపించకుండా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఎప్పటికప్పుడు ఆ దేశం బీదతనం, తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయపటడేసేందుకు పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి రుణం కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ లోపు అప్పులను తీర్చేందుకు పాకిస్తాన్ తన కీలకమైన ఎయిర్‌లైన్స్‌ను అమ్మకానికి పెట్టింది. ఐఎంఎఫ్ షరతుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పీఐఏ విక్రయం అనేది గత రెండు దశాబ్దాలలో పాకిస్తాన్ చేసిన మొదటి అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రయత్నం కానుంది.
అతి పెద్ద ప్రైవేటీకరణ..
ఎయిర్ లైన్స్ అమ్మకం గురించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం పీఐఏబిడ్డింగ్ 2025, డిసెంబర్ 23న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం పీఐఏలోలో 51-100 శాతం వాటాను విక్రయించనున్నారు. ఈ ఏడాది ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ. 86 బిలియన్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తెలిపారు. మరోవైపుపీఐఏ దశాబ్దాలుగా అవినీతిలో కూరుకుపోయి ఉంది. నిర్వహణ లోపాలు, పైలెట్ లైసెన్స్ కుంభకోణంతో ఇది కుదేలయిపోయి ఉంది. ఇప్పుడు దీనిని కొనుగోలు చేసేందుకు నలుగురు బిడ్డర్లు అర్హత పొందారని తెలుస్తోంది. ఇక ఈ ఎయిర్ లైన్స్ విక్రయం ద్వారా వచ్చే ఆదాయంలో 15శాతం ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలినది కంపెనీ పునరుద్ధరణ కోసం ఉపయోగించనున్నారు.
ఆసిమ్ మునీర్ కోసమేనా?
ఈ ఎయిర్ లైన్స్ అమ్మకం లోనూ, దాని ద్వారా వచ్చే ఆదాయం విషయంలోనూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్మునీర్ హస్తం ఉందని తెలుస్తోంది. బిడ్డింగ్ కు అర్హత పొందిన నాలుగు సంస్థల్లో ఒకదానితోఆసిమ్ కు సంబంధాలున్నాయి. ఆ నాలుగింటిలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఇది పాకిస్తాన్‌లో అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన ఫౌజీ ఫౌండేషన్‌లో భాగం. ఇందులో క్వార్టర్‌మాస్టర్ జనరల్ (క్యూఎంజీ)నియామకం ద్వారా ఆయన ఈ సంస్థపై పరోక్ష ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దీంతో ఈ విక్రయం అంతా మునీర్ కోసమే చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే ఆసిమ్మునీర్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. సొంత దేశ ప్రజలే ఆయన మండిపడుతున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మునీర్ పై ఆరోపణలను చేశారు.
Follow Us