Trump: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్.. మరింత కఠినంగా వెట్టింగ్ రూల్స్

ఇటీవల అమెరికా H1 బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ యంత్రాంగం వెట్టింగ్‌ రూల్స్‌ను మరింత కఠినతరం చేసేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
USA Orders H-1B, H-4 Visa Applicants To Make Social Media Profiles Public

USA Orders H-1B, H-4 Visa Applicants To Make Social Media Profiles Public

Trump: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా వలసదారుల విషయంలో ఏమాత్రం వెన్కకి తగ్గడం లేదు. ఇటీవల H1 బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ యంత్రాంగం వెట్టింగ్‌ రూల్స్‌ను మరింత కఠినతరం చేసేసింది. ఈ వీసాలకు అప్లై చేసుకునే లింక్డిన్ పేజీలు, రెజ్యూమ్‌లను సమీక్షించాలని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌ దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేసింది. 

వాక్‌ స్వాతంత్ర్యం అణిచివేసేలా సెన్సార్‌షిప్‌ను అమలు చేయడం కోసం గతంలో పనిచేసినట్లు తేలితే వాళ్ల వీసాలు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని స్టేట్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 2న అమెరికా దౌత్య కార్యాలయాలకు వెట్టింగ్ ఆదేశాలను పంపించారు. వీటి ప్రకారం చూసుకుంటే H1బీ వీసాదారులతో పాటు హెచ్‌4 వీసాదారుల రెజ్యూమ్, లింక్టిన్ ప్రొఫైళ్లను సమీక్షించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు అసత్య ప్రచారం, ఫ్యాక్ట్‌ చెకింగ్, కంటెంట్ కంట్రోల్, ఆన్‌లైన్ సేఫ్టీ  లాంటి విభాగాల్లో పనిచేశారా అని పరిశీలిస్తారు.  

Also Read: హిడ్మాది భూటకపు ఎన్‌కౌంటర్‌...మావోయిస్టు పార్టీ కీలక లేఖ

ఈ సమీక్ష డిసెంబర్ 15 నుంచి జరగనుంది. విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై పరిశీలన ఉంటుంది. H1బీ వీసాలకు అప్లై చేసుకున్న వాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్ చేయాలని ఇప్పటికే అమెరికా ఆదేశించింది. అమెరికా వీసా అనేది హక్కు కాదని.. అదొక ప్రత్యేక అర్హత అని పేర్కొంది. దేశభద్రతకు ముప్పు కలిగించే దరఖాస్తుదారులను గుర్తించడం కోసమే అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీనింగ్ చేస్తామని తెలిపింది. H1బీ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లలో ఎక్కువమంది భారత్, చైనాకు చెందినవాళ్లే ఉన్నారు.   

అమెరికా వీసాలకు అప్లై చేసుకున్న వారి ఆన్‌లైన్‌ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేస్తారు. వారి సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలిస్తారు. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. ఈ పరిశీలన తర్వాతే దరఖాస్తుదారులకు వీసా మంజూరు చేయాలా ? వద్దా ? అనేది అధికారులు నిర్ణయిస్తారు. మరోవైపు H1బీ వీసా ఫీజును ఇటీవల ట్రంప్ యంత్రాంగం లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. 

Also Read: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు

ఈ వీసా ఫీజు వార్షిక ఫీజు కాదని.. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైన్‌ ఫీజు అని వైట్‌హౌస్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంటే కొత్తగా H1బీ వీసా అప్లై చేసుకోబోయే వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతేకాదు అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం H1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  

Advertisment
తాజా కథనాలు