Putin India Visit: హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు ఆతిథ్యం.. అది ఎవరిదో తెలుసా?

సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారతదేశానికి చిరకాల మిత్రుడిగా ఉన్న పుతిన్‌ 2 రోజులపాటు మనదేశంలో పర్యటిస్తారు. కాగా ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక భవంతి హైదరాబాద్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వనున్నారు.

New Update
FotoJet - 2025-12-05T073602.961

Putin hosted at Hyderabad House

Hyderabad House : సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin india visit)కు మనదేశంలో ఘన స్వాగతం లభించింది. భారతదేశానికి చిరకాల మిత్రుడిగా ఉన్న పుతిన్‌ రెండు రోజుల పాటు మనదేశంలో పర్యటించనున్నాడు. కాగా ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక భవంతిలో ఆతిథ్యం ఇవ్వనున్నారు. దేశాధినేతలతో దౌత్య సంబంధాలకైనా, విదేశీ ప్రముఖులతో ఛాయ్‌పే చర్చలకైనా.. విలేకరుల సమావేశాలైనా, ముఖ్య కార్యక్రమాలైనా అన్నింటికీ తిరుగులేని వేదికగా ఉన్న దాన్నే పుతిన్‌(russia president vladimir putin)కు కేటాయించడం విశేషం. ఇంతకు ఆ భవనం ఏంటో తెలుసా? హైదరాబాద్‌ హౌస్‌. దిల్లీలో  ఉన్న ఈ ‘హైదరాబాద్‌ హౌస్‌’(hyderabad-house-rates) వెనక ఎన్నో చారిత్రక విశేషాలున్నాయి.

ఇంతకు ఇది ఎవరిదో తెలుసా? తెలంగాణది.. అవును నాటి నిజాం నవాబులది. వారి కలల సౌధంగా రూపుదిద్దుకున్న ఈ కట్టడం దేశ రాజధాని నగరంలో హైదరాబాద్‌ దర్పానికి ప్రతిబింబంగాచెబుతారు. హైదరాబాద్ హౌస్  నిర్మాణం1926లో ప్రారంభం కాగా.. 1928లో పూర్తయింది. హైదరాబాద్ చివరి నిజాం మిర్‌ ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు. నాడు దీని నిర్మాణానికి అయిన ఖర్చు రెండు లక్షల పౌండ్లు. అప్పుడు అధికారంలో ఉన్న బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీ(delhi)కి మార్చుకున్నాక.. నిజాం నవాబు అలీఖాన్‌ తన ఖ్యాతికి తగ్గట్టుగా దీనిని నిర్మించుకున్నారు. ఆ సమయంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న నిజాం నవాబు తన స్థాయికి తగ్గట్టు వైస్రాయ్ హౌస్‌ పక్కనే దీనిని ఏర్పాటు చేయాలని అనుకున్నారు.. కానీ, బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చివరకు వైస్రాయ్‌ హౌస్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ హౌస్ నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది.

Also Read :  ఆసిమ్‌ మునీర్‌ కు మరో ఉన్నత పదవి..పాక్‌ సీడీఎఫ్‌గా నియామకం

అందమైన కట్టడం

తను ఢిల్లీ వెళ్లిన సమయంలో తమకంటూ ఒక విడిది ఉండాలని భావించిన ఏడో నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టాడు. అందుకోసం విదేశీ వాస్తు శిల్పి ఎడ్విన్‌ లుటియన్స్‌కు ఈ బాధ్యతలను అప్పగించడం విశేషం. యూరోపియన్‌‌- మొఘలుల శైలిని కలగలుపుతూ ఈ నిర్మాణం సాగింది.  ఎత్తైన గుమ్మటంతో నిర్మితమైన ఈ భవనంలో అదే ప్రధాన ఆకర్షణ. ఇది వైస్రాయ్‌ నుంచి తీసుకున్న డిజైన్‌. ఇక లుటియన్స్ సీతాకోకచిలుక ఆకారంలో, చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉండేలా నిజాం తన కలల సౌధాన్ని తీర్చిదిద్దారు. ఈ హౌస్‌లో మొత్తం 36 గదులు ఉన్నాయి. విశాలమైన ప్రాంగణాలు, గంభీరంగా కనిపించే మెట్లమార్గాలు, ఫౌంటెయిన్లు ఆకట్టుకుంటాయి. ఈ ప్యాలెస్‌లో జెనానా ఏరియా కూడా ఉంది. అందులో 12-15 గదులు ఉంటాయి. అది మహిళల కోసం ఉద్దేశించింది.   

Also Read :  అమ్మో.. పుతిన్ ప్రయాణించే విమానానికి ఇంత సెక్యూరిటీ ఉంటుందా ! తెలిస్తే షాక్ అయిపోతారు

ఎందరికో అతిథ్యం

విదేశీ ప్రముఖులకు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్‌ను నిజాం కేవలం నాలుగు సార్లు మాత్రమే సందర్శించడం గమనార్హం. సంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా, ఆధునిక యూరోపియన్‌ శైలిలో  దాన్ని నిర్మించడంతో ఇందులో ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదు. ఇక, స్వాతంత్య్రం అనంతరం ఇది హైదరాబాద్‌ హౌస్‌గా రూపాంతరం చెందింది. మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లింది. 1, అశోకా రోడ్‌లో ఉన్న ఈ ప్రఖ్యాత కట్టడం ప్రభుత్వ అతిథి గృహంగా నాటి నుంచి తన స్థానాన్ని  సుస్థిరం చేసుకుంది. ఢిల్లీ నగరం నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హైదరాబాద్‌ హౌస్‌ ఎందరో ప్రముఖులకు ఆహ్వానం పలుకుతోంది. అందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఇలా ఎందరో అతిథ్యం స్వీకరించారు. పుతిన్‌ (Putin)  కూడా ఏడేళ్ల క్రితం ఇక్కడకు వచ్చిన సమయంలో  ఇక్కడే ఆతిథ్యం పొందారు. 

Advertisment
తాజా కథనాలు