/rtv/media/media_files/2025/12/04/putin-2025-12-04-17-06-39.jpg)
Putin
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో భారత్‌కు రానున్నారు. ఆయన రాకతో దేశంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి పుతిన్ వస్తున్న శైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన విమానాల సముదాయంలో రెండు విమానాలు ఒకేలా ఉన్నాయి. వాటి రూపురేఖలు కూడా ఒకేలా ఉన్నాయి. పుతిన్ తన స్నేహితులతో కలిసి IL--96--300PU మోడల్‌కి చెందిన రెండు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారనేది ఎవరికి తెలియదు. ఒకేలా కనిపించే విమానాన్ని డెకాయ్ ఫ్లైట్ అని అంటారు.
ఒకటి నిజమైన విమానం, మరొకటి నకిలీది. ఈ రెండు కలిసే ఎగురుతాయి. కొన్నిసార్లు ఒకదాని రాడర్ సిగ్నల్స్ ఆఫ్‌లో ఉంటుంది. మరొకటి ఆన్‌లో ఉంటుంది. అప్పుడప్పుడు రెండూ కూడా అదృశ్యమవుతాయి. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధం, యూరోపియన్ దేశాల అసంతృప్తి నేపథ్యంలో రష్యా భద్రతా సంస్థలు ఈ చర్యలు తీసుకున్నాయి.
Also Read: అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్.. మరింత కఠినంగా వెట్టింగ్ రూల్స్
పుతిన్ విమానం కజకిస్తాన్ మీదుగా ఆకాశంలోకి ప్రవేశించినప్పుడు రెండు విమానాల మధ్య డెకాయ్ డ్రిల్ ప్రాంభించారు. రెండు విమానాలు ఒకే రూట్‌లో వేగంగా, కజకిస్తాన్ మీదుగా కొద్ది దూరంలో ఎగురుతున్నట్లు కనిపించాయి. వీటిలో ఒకదాని పేరు RSD221 మరొకటి RSD369. అయితే పుతిన్ ఏ విమానంలో ఉన్నారనేది చాలాకష్టం.
పుతిన్ ప్రయాణిస్తున్న IL-96 మోడల్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది సాధారణ విమానం కాదు. దానిలోపలి నుంచే పుతిన్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా రష్యా అణు దళాలలను కంట్రోల్ చేయగలడు. ఈ ఫ్లైట్‌కు శాటిలైట్ ఫోన్లు, జామింగ్ సిస్టమ్స్, ప్రత్యేక క్షిపణి రక్షణ పరికరాలు అమర్చారు. ఇంధన ట్యాంక్ నిండిన అనంతరం అది ఏకంగా 13 వేల కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ఎగురుతుంది.
Also Read: భార్యతో విడాకులు, ముగ్గురు అక్రమ సంతానం.. పుతిన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
గతంలో కూడా పుతిన్ భద్రత కోసం రష్యాన్ సెక్యూరిటీ సంస్థలు "డబుల్ షీల్డ్ ప్రోటోకాల్"ను వినియోగించాయి. అంటే డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేయాలంటే మొదటగా పుతిన్ ఏ విమానంలో ఉన్నారో గుర్తించాలి. కానీ ఇది గుర్తుపట్టడం అసాధ్యం. ఎందుకంటే ఈ రెండు విమానాలు కూడా కొన్ని నిమిషాలకొకసారి తమ సిగ్నల్స్‌ను ఆన్, ఆఫ్ చేస్తాయి. కొన్నిసార్లు ఒకటి రాడార్ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఇంకొటి కనిపిస్తుంది. కొన్నిసార్లు రెండు అదృశ్యమవుతాయి. దీనివల్ల పుతిన్ ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఎలాంటి ఆటంకం లేకుండా సులువుగా, అత్యంత సురక్షితంగా వెళ్లగలరు.
Follow Us