Putin: భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లో ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే. 

New Update
Putin

Putin

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లో ల్యాండ్ అయిన ఆయనకు ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, పరిశ్రమలు, అంతరిక్షం,వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కూడా పుతిన్‌ను రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక స్వాగతం పలకనున్నారు. 

చివరిసారిగా పుతిన్ 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆయన మరోసారి భారత్‌లో అడుగుపెట్టారు. ఇరుదేశాధినేతలు ఎలాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకోనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. రక్షణ రంగంలో చూసుకుంటే భారత్‌.. మరో అయిదు S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే నిల్వ ఉన్న S-400ల కోసం మరో 300 క్షిపణులను కొనుగోలు చేసేందుకు కూడా ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది.  

Advertisment
తాజా కథనాలు