/rtv/media/media_files/2025/05/20/EfTACJFAKfyLs6CvLF5t.jpg)
Asim Munir
Asim Munir : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ గా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్(pak army chief asim munir)కు మరో ఉన్నత పదవి లభించింది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF)గా ఆసిమ్ మునీర్‌ను నియమిస్తూ పాక్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ అధ్యక్ష కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మునీర్ పదవీ కాలం గత నెల 29తోనే ముగిసింది. అయితే పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలను ఏకీకృతం చేసేందుకు పాక్ ప్రభుత్వం పూనుకుంది. దీనికోసం 27వ రాజ్యాంగ సవరణ చేసి తద్వారా సీడీఎఫ్ పదవిని సృష్టించింది. కాగా ఈ పదవీకాలం ఐదేళ్లు కొనసాగనుంది. ‘‘ఐదేళ్ల కాలానికి ఏక కాలంలో సైనిక దళాల చీఫ్‌గా వ్యవహరించేందుకు సీడీఎఫ్ పదవికి ఆసిమ్ మునీర్‌ను నియమించాలని పాక్ ప్రధాని సమర్పించిన సిఫార్స్‌ను అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించారు’’ అంటూ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
Also Read : పుతిన్ ఆరోగ్య రహస్యం.. ఆయన ఏం తింటారో తెలుసా ?
Asim Munir Appointed As Pak CDF
గతంలో ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన మునీర్ పాక్ ప్రభుత్వం(Pakistan government) ఈ ఏడాదే అరుదైన ఫీల్డ్ మార్షల్ హోదాను కలిపించింది. పాక్ లో ఇది అత్యున్నత సైనిక హోదా. పాక్ చరిత్రలో ఇంతకుముందు జనరల్ అయూబ్ ఖాన్‌కు మాత్రమే ఫీల్డ్ మార్షల్ హోదా లభించగా తిరిగి మునీర్‌కు మాత్రమే ఆ గౌరవం లభించింది. తాజాగా ఇప్పుడు సీడీఎఫ్‌గా నియమితుడయ్యాడు. ఈ నియామకంతో పాక్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మునీర్ నిలిచారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా ఆయన రక్షణ పొందనున్నారు. ఆయనను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఐదేళ్ల పాటు ఈ పదవిలో మునీర్ కొనసాగనున్నారు.
సీడీఎఫ్‌గా ఆసిమ్ మునీర్‌ను ప్రకటించడానికి ముందు అనేక ఊహాగానాలు వచ్చాయి. ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కావాలనే ఈనియామకాన్ని ఆలస్యం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఎట్టకేలకు పాక్ ప్రభుత్వం సీడీఎఫ్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం, మునీర్ నియమితుడయ్యాడు.
Also Read : భార్యతో విడాకులు, ముగ్గురు అక్రమ సంతానం.. పుతిన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Follow Us