Fire Accident: వృద్దాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది స్పాట్ డెడ్ !
అమెరికా , మసాచుసెట్స్‌లోని ఫాల్ రివర్ లో ఉన్న గాబ్రియేల్ హౌస్ వృద్దాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది చనిపోగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి.
అమెరికా , మసాచుసెట్స్‌లోని ఫాల్ రివర్ లో ఉన్న గాబ్రియేల్ హౌస్ వృద్దాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది చనిపోగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి.
భారతదేశంలో రూ. 2వేల నోట్ల ఉపసంహరణ తర్వాత, నేపాల్ సరిహద్దు ప్రాంతాలలో అవి చలామణి అవుతున్నాయని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తులో తేలింది. రూ.2వేల నోట్లు తీసుకొని వాటికి బదులుగా రూ.1200 నుంచి రూ.1600 వరకు ఇస్తున్నట్లు సమాచారం.
ఫిలిప్పీన్స్‌లోని లూజోన్ ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని మనీలాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
అమెరికా ప్రభుత్వం మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే తాజా టమాటాలపై 17% సుంకాన్ని విధించింది. టమాటా దిగుమతులపై సుంకం విధించకుండా అడ్డుకునేందుకు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయంగా టమాటో ఉత్పత్తి పెంచాలని అమెరికా ఇలా చేసింది.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి. యుద్ధ రంగంలో రోబోలు, డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి.
వరుసపెట్టి అమెరికాను వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూ మెక్సికో, టెక్సాస్ ల తర్వాత ఇప్పుడు న్యూ జెర్సీలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
50 రోజుల్లో ఉక్రెయిన్ తో కాల్పుల విరమణకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించాలి లేకపోతే తీవ్రమైన సుంకాలతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ మాట వినకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓ అధ్యయనం ప్రకారం స్త్రీలు ప్రతిరోజూ రెడీ అవ్వడానికి సగటున 60 నిమిషాలు కేటాయిస్తారని తేలింది. ఒక ఏడాదిలో సగటు మహిళ రెడీ అవ్వడానికి కేటాయించే సమయం సుమారు 365 గంటలు. ఒక మహిళ 60 సంవత్సరాల వయోజన జీవితంలో రెడీ అవ్వడానికి దాదాపుగా 2.5 సంవత్సరాలు కేటాయిస్తారట.
రష్యాలో పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు ఆ దేశం భారత్‌పై ఫోకస్ పెట్టింది. 2025 చివరి నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు రష్యా ఉపాధి కల్పించనున్నట్లు సమాచారం.