/rtv/media/media_files/2026/01/14/canada-2026-01-14-15-39-58.jpg)
Punjabi Businessman Shot Dead Near His House In Canada's Surrey
విదేశాల్లో భారతీయులపై దాడులు, హత్యలు జరుగుతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కెనడాలో ఓ భారతీయుడు హత్యకు గురయ్యాడు. సర్రె నగరంలోని మంగళవారం మధ్యాహ్నం పంజాబ్‌కు చెందిన బిందర్ గర్చా (48) అనే వ్యాపారవేత్త తన ఇంటికి కొంత దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బిందర్ గర్చా బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. అతడు కొన్నేళ్లుగా కెనడాలో స్టూడియో -12 పేరుతో ఫొటో స్టూడియో నడిపిస్తున్నట్లు చెప్పారు. కానీ హత్యకు గల కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
గతేడాది డిసెంబర్‌లో టొరంటో యూనివర్సిటీ సమీపంలో శివాంక్ అవస్థి(20) అనే భారతీయ విద్యార్థిని దుండగులు కాల్చి చెపారు. అదే నెలలో టొరంటోలో నివసిస్తున్న 30 ఏళ్ల హిమాన్షీ ఖురానా దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆమెకు తెలిసిన వ్యక్తి ప్రధాన నిందితుడిని అబ్దుల్ గఫూరీగా పోలీసులు గుర్తించారు.
Follow Us