Trump VS Iran: ఈసారి బుల్లెట్ మిస్ కాదు..ట్రంప్ పై ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులు

ఇరాన్ పై అమెరికా దాడులు చేయడం కచ్చితం అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి చర్యలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పై ఇరాన్‌ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదని హెచ్చరించింది.

New Update
trump attack

ఇరాన్ లో 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు అమెరికా మద్దతు పలుకుతోంది.  అవసరమైతే ఇరాన్ పై దాడికి కూడా దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఆందోళనలు ఆపొద్దని..ఇరాన్ సుప్రీం లీడర్ తలొగ్గే వరకు పోరాటం చేయాలని ఇరాన్ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆ దేశంపై దాడికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌పై ఇరాన్‌ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఈసారి బుల్లెట్‌ మిస్‌ కాదని హెచ్చరించింది. ఇంత వరకు మాటలతోనే బెదిరించిన ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష దాడి చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్‌ పై హత్యాయత్నం జరిగింది. ఇందులో ఆయన చెవికి గాయం కూడా అయింది. బుల్లెట్ చెవిని తాకుతూ వెనక్కు పోయింది. అప్పటి  ఘటనకు సంబంధించిన ఫొటోను ప్రసారం చేసిన ఇరాన్‌ టీవీ.. ఈసారి బుల్లెట్‌ గురి తప్పదు అని బెదిరింపుల సందేశాన్ని టెలికాస్ట్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు  తెలిపాయి. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

యుద్ధానికి సిద్ధం..

ఇదిలా ఉండగా ఇరాన్‌పై 24 గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖతార్‌లో ఉన్న తమ కీలక అల్‌-ఉదెయిద్‌ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. అమెరికా, దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్‌-ఉదెయిద్‌ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్‌ను కూడా ప్రారంభించాయి. దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ప్రత్యేక అనుమతితో ఉన్న వచ్చే, పోయే విమానాలు మాత్రమే తిరగగలవని ప్రకటించింది. 

మరోవైపు ఇరాన్‌లో ఆందోళనల సందర్భంగా మృతిచెందినవారి సంఖ్య 2,571కు పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని దేశవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అలాగే అరెస్టయిన ఆందోళనకారులపై విచారణను వేగంగా చేస్తోంది. ఇప్పటి వరకు ఖమేనీ ప్రభుత్వం 2 వేల మందిని ఉరి తీసిందని తెలుస్తోంది. కానీ ట్రంప్ మాత్రం ఇరాన్‌.. ఓ నిరసనకారుడిని ఉరితీసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయని..తన బెదిరింపుల వల్లే హత్యలు, ఉరిశిక్షలను ఆపేసిందని ట్రంప్ చెబుతున్నారు. 

Also Read: Ayatollah-Ali-Khamenei: ఇరాన్ ను శాసిస్తున్న అంతులేని శక్తి.. ఎవరికీ లొంగని సుప్రీం లీడర్ ఖమేనీ..

Advertisment
తాజా కథనాలు