/rtv/media/media_files/2026/01/14/trump-2026-01-14-19-02-59.jpg)
Trump's Warning After Greenland Chooses Denmark
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటీవలే అమెరికా దీనికి సంబంధించి ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అయితే తాము అమెరికాలో చేరబోమని డెన్మా్ర్క్‌లోనే ఉంటామని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ట్రంప్ నీల్సన్ అభిప్రాయంతో ఏకీభవించడం లేదన్నారు. అతడి గురించి తనకు సరిగా తెలియదన్నారు. డెన్మార్క్‌లోనే కొనసాగాలనుకుంటే అది గ్రీన్‌లాండ్‌కే పెను సమస్యగా మారుతుందని హెచ్చరించారు.
Also Read: NTVపై సీఎం రేవంత్ సీరియస్.. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశం
గ్రీన్‌లాండ్, డెన్మార్క్‌కు ఏవైనా ఆఫర్లు ప్రకటించారా అని మీడియా అడిగిన ప్రశ్నకు అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్ తప్పకుండా అమెరికా భూభాగంలో చేరాలన్నారు. లేకపోతే ఆ ప్రాంతాన్ని రష్యా, చైనా ఆక్రమిస్తాయన్నారు. ఆ దేశాల రక్షణ బలగాలు ఇప్పటికే అక్కడ పాగా వేసినట్లు పేర్కొన్నారు. తాను తలుచుకుంటే అక్కడ ఎక్కువ సంఖ్యలో తమ సైన్యాన్ని మోహరిస్తామన్నారు. గ్రీన్‌లాండ్‌లో అమెరికా జెండా ఎగరాల్సిందేనంటూ తేల్చిచెప్పారు.
Follow Us