/rtv/media/media_files/2024/12/19/VIetUdDNX5qAY6fhnhqb.jpg)
Visa Photograph: (Visa)
ఏది ఏమైనా వలసదారులపై కఠిన చర్యలు తప్పవని చెబుతోంది అమెరికా. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపైనే కాదు ఇక రావాలనుకున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అంటోంది. ఈ విషయంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా ప్రభుత్వ పథకాలపైనే వారు ఎక్కువగా ఆధారపడి జీవించే అవకాశాలు ఉన్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. వీరందరూ అమెరికా ప్రజలు వ్యతిరేకించేంతగా...అధిక సంక్షేమాలను పొందుతున్నారని యూఎస్ ప్రభుత్వం చెబుతోంది.
US suspends visa processing for 75 countries and doesn't even have a good reason as to why. pic.twitter.com/cq3JuJNf4b
— SUPERINFORMATIVE on TikTok (@i_likebrandon) January 14, 2026
పాకిస్తాన్, రష్యాలకు కూడా..
ఇప్పటికే తమ దేశ అందరికీ చాలా చేసిందని..ఇక మీదట అలా జరగనివ్వమని తెలిపింది. అందుకే కొత్త వలసదారులు అమెరికన్ల సంపదను సంగ్రహించకుండా రక్షణ కల్పించేంతవరకూ, వారు మాకు భారంగా మారరని నిర్ధారణ అయ్యేంతవరకూ 75 దేశాల వారి వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేస్తున్నామని చెప్పింది. అమెరికన్స్ ఫస్ట్ అన్నదే తమ మంత్రమని..ట్రంప్ సర్కార్ దానికే ఎప్పుడూ ప్రాథాన్యం ఇస్తుందని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ఈ నెల 21 నుంచి 75 దేశాల పౌరుల వీసా ప్రాసెసింగ్ నిలిపివేత మొదలౌతుందని చెప్పింది. ఈ దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ , రష్యా, ఆఫ్గానిస్తాన్, బ్రెజిల్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్ తో సహా మరికొన్ని దేశాలున్నాయి.
Follow Us