Iran: ఇరాన్‌ వదిలి వెళ్లిపోండి.. కేంద్రం కీలక ప్రకటన

గత కొన్నిరోజులుగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయ్యింది. ఇరాన్‌లో ఉంటున్న భారతీయ పౌరులు దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది.

New Update
Indian embassy

Indian embassy

గత కొన్నిరోజులుగా ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలు హింసాత్మక ఘటనలుగా మారడంతో ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి భారత రాయబార కార్యాలయం అలెర్ట్ అయ్యింది. ఇరాన్‌లో ఉంటున్న భారతీయ పౌరులు దేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ సూచనలు చేసింది. 

Also Read: మరో దారుణం.. కెనడాలో భారతీయుడు హత్య

ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరగడం, కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీ అధికారంలో నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  

Also Read: ఇరాన్‌లో ఆగని హింస...బలవుతున్న సామాన్యులు..చలి కాచుకుంటున్న ట్రంప్‌

మరోవైపు ఇరాన్‌ ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతిస్తు్న్నారు. నిరసనలు ఇలాగే కొనసాగించాలని, ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. పోరాటానికి సాయం చేస్తామంటూ ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. హంతకులు, దాడులు చేసేవారి పేర్లను నమోదు చేసుకోవాలని.. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. నిరసనకారుల హత్యలు ఆపేదాకా ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేసుకున్నాని చెప్పారు. ఇదిలాఉండగా పరిస్థితులు తమ కంట్రోల్‌లోకి వచ్చాయని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు