/rtv/media/media_files/2025/06/18/Ayatollah Ali Khamenei -fd83008d.jpg)
Iran will not surrender, Says Ayatollah Ali Khamenei
లాస్ట్ 20 రోజులుగా ఇరాన్ అల్లకల్లోలంగా ఉంది. ఆ దేశ సుప్రీం లీడర్ వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. వేలాది మంది చనిపోతున్నారు. అమెరికా ఇరాన్ లో నిరసనకారుల పక్షాన నిలిచింది. ఆ దేశంపై దాడికి దిగుతామని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తో వాణిజ్యం చేస్తున్న దేశాలపై 25 శాతం సుంకాలను విధించారు. అయితే ఇప్పటి వరకు ఇరాన్ ఇప్పటి వరకు ఎటువంటి తిరుగుబాటు జరగలేదు. జరుగుతుందో లేదో కూడా తెలియదు.
మరోవైపు ఖమేనీకి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నా...ఆయన లొంగిపోయేంత బలంగా మాత్రం లేవు. అలాగే దేశం అల్లకల్లోలం అయిపోతున్నా...సుప్రీం లీడర్ కూడా ఎక్కడా తలొగ్గడం లేదు. అంతకంతకూ తన పట్టుదలను పెంచుకుంటూ పోతున్నారు. అసలు ఖమేనీ ఎందుకంత శక్తిమంతంగా ఉన్నారు. అతనిని రక్షిస్తున్న శక్తి ఏంటి? 1979లో షా రెజా పహ్లావిని పదవీచ్యుతుడిని చేయడం, ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవాన్ని ప్రారంభించి..ఆ దేశ ఉన్నతికి పాటుపడిన ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ పై ఇప్పుడెందుకు ఇంతలా వ్యతిరేకత పెరిగింది. అప్పటికీ, ఇప్పటికీ మధ్య తేడా ఏంటి?
అసలు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఆందోళనలకు ఆజ్యం 2024లో పడింది. 2024 ప్రారంభం నుంచి ఇరాన్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.. రియాల్ వాల్యూ పడిపోయింది.. విద్యుత్, గ్యాస్ సరఫరాలకు అంతరాయం కలిగింది. నీటి కొరత కూడా ప్రారంభమైంది. దీని వలన ఆ దేశ ప్రజల జీవితం కష్టతరమైంది. దాంతో పాటూ అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన గొడవలు అయ్యాయి. ఇందులో అమెరికా ఇరాన్ అణు కర్మాగారాన్ని నాశనం చేసింది. దాంతో మిగిలిన ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దీని తరువాత ఇరాన్ మరింత ఆర్థికంగా బలహీనపడింది. ఇదే ఇరాన్ ప్రజల ఆగ్రహానికి కారణమయింది. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. డిసెంబర్ 28 నుంచి ఇరాన్ రణరంగంగా మారింది. టెహ్రాన్ లో దుకాణదారులు మొదలెట్టిన నిరసనలు క్రమంగా యూనివర్శిటీలకు...మొత్తం దేశం అంతా వ్యాపించాయి. ఇవి సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా మారాయి. ఆయన పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరాన్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపారు. అందరినీ అరెస్ట్ చేశారు. అక్కడక్కడ కాల్పులు కూడా జరిగాయి. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 3వేల మంది మరణించారని తెలుస్తోంది. 100 మందికి పైగా సైనికులు కూడా మృతి చెందారు.
ఖమేనీ చుట్టూ పటిష్ట వలయం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వయసు చాలా ఎక్కువే. ఇరాన్ లో నిరసనలు తీవ్రం అవుతున్నా..ఆయన మాత్రం దేశాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళిపోలేదు. అక్కడే ఎక్కడో ఒకచోట ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఖమేనీ చుట్టూ పటిష్ట భద్రతా వలయం ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఇరాన్ నిఘా వ్యవస్థ, సైన్యం, పోలీసులు అందరిపైనా కూడా నియంత్రణ కలిగి ఉన్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో మొత్తం సైనిక శక్తిని సుప్రీం మత నాయకుడు అలీ ఖమేనీ కార్యాలయంలో కేంద్రీకరించే ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఖమేనీకి రెజా షా పహ్లవి లాగా దేశం విడిచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే అతను ఇరాన్‌కు మాత్రమే కాకుండా ఇస్లాంలోని పెద్ద విభాగానికి, షియా శాఖకు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. ఖమేనీ స్థానంలో వచ్చిన రుహోల్లా ఖమేనీ ఇస్లామిక్ విప్లవం ద్వారా ఇరాన్‌లో అధికారంలోకి వచ్చారు.
దూరంగా ఉంటున్న ట్రంప్..
అయతుల్లా అలీ హుస్సేనీ ఖమేనీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇరాన్‌ను అస్తవ్యస్తంగా వదిలేస్తే, ఇస్లామిక్ ప్రపంచం అంతటా వేరే సందేశం వెళుతుంది. అలాగే షియా సున్నీల మధ్య విభజించబడిన ఇస్లామిక్ ప్రపంచంలో తనను తాను ఇస్లాం నాయకుడని ఖమేనీ పిలిపించుకుంటున్నారు. ఆ ఇమేజ్ కూడా దెబ్బ తింటుంది. ఇవన్నీ ఖమేనీకి ఇష్టం లేదు. అందుకే దేశం విడిచి పారిపోలేదు. ప్రస్తుతం ఖమేనీ వయసు 86 ఏళ్ళు. ఈ వయసులో పారిపోయిన నాయకుడిగా ముద్ర వేయించుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఈ విషయం పలుసార్లు ఆయనే చెప్పారు. దాని కంటే బలిదానం అవ్వడమే మంచిదని ఖమేనీ అభిప్రాయం. అందుకే అమెరికా బెదిరింపులకు సైతం సుప్రీం లీడర్ లొంగడం లేదు. మరోవైపు ట్రంప్ కూడా ఖమేనీపై దాడికి తొందరపడడం లేదు. సుప్రీం లీడర్ తర్వాత ఇరాన్ ను ఎవరు అదుపులోకి తీసుకుంటారో ఎవరికీ తెలియడం లేదు. దాని కోసమే ట్రంప్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఖమేనీ లాంటి వారు ఎవరూ లేకపోతే...ఆ దేశ ఉనికికి ఇవే చివరి రోజులు అవుతాయి. ఆ తర్వాత ఇరాన్ ఏమవుతుందో నిర్ణయించడం కూడా కష్టం. అందుకే అమెరికా అధ్యక్షుడు కూడా ఇరాన్ కు ప్రస్తుతం దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
Follow Us