/rtv/media/media_files/2026/01/01/iran-protesters-try-to-break-into-government-building-as-unrest-continues-2026-01-01-12-58-11.jpg)
Iran protesters try to break into government building as unrest continues
దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడం తప్పదని అంటున్నారు. వచ్చే 24 గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించినట్లు రాయిటర్స్ వంటి పలు వార్తా సంస్థలు చెబుతున్నాయి. రోజురోజుకూ మరణాలు ఎక్కువ అవుతుండడంతో అమెరికా ఇరాన్ పై దాడి చేయాలనుకుంటోందని చెబుతున్నాయి. అయితే ఎంత ఈ దాడుు ఎంత తీవ్రంగా ఉంటాయనేది మాత్రం తెలియడం లేదు. ఇరాన్‌కు దగ్గరలో ఖతార్‌లో ఉన్న తమ కీలక అల్-ఉదెయిద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఇప్పటికే ఖాళీ చేయిస్తోంది. అమెరికా, దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్-ఉదెయిద్ వైమానిక స్థావరంలో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్‌ను కూడా ప్రారంభించాయి.
గగనతలాన్ని మూసేసిన ఇరాన్..
ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ ఎయిర్ స్పేస్ ను మూసేస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక అనుమతితో ఇరాన్ కు వెళ్ళే, అక్కడి నుంచి వచ్చే విమానాలు తప్ప ఇంక వేటికీ అనుమతి లేదని తెలిపింది. దీనికి సంబంధించి నిన్న రాత్రి NOTAM (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది. అయితే దీనికి ముందే ఇరాన్, ఇరాక్ గగనతలం అంతా ఖాళీ అయిందని విమాన ట్రాకింగ్ వెబ్ సైట్ లు చూపించాయి.
దీంతో భారత విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. ఇరాన్ లో ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారిమళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపాయి. కొన్నింటిని దారి మళ్ళాస్తున్నామని, మరి కొన్నింటిని క్యాన్సిల్ చేశాయని చెప్పాయి. ప్రయాణికులు అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి ఎయిర్ ఇండియా విజ్ఞప్తి చేసింది. అలాగే మరో విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ గగనతలం మూసివేయడంతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం పడిందని తెలిపింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నామని చెప్పింది.
ఆందోళనకారులపై విచారణ..
మరోవైపు ఇరాన్‌లో ఆందోళనల సందర్భంగా మృతిచెందినవారి సంఖ్య 2,571కు పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని దేశవ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అలాగే అరెస్టయిన ఆందోళనకారులపై విచారణను త్వరితగతిన పూర్తిచేసి, కఠినంగా శిక్షించేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. నిరసనకారులకు సంబంధించి ఏ చర్యలు తీసుకోవాలన్నా వెంటనే తీసుకోవాలని.. ఆలస్యమైతే తీవ్రత తగ్గిపోయి, పెద్ద ప్రభావం ఉండదని ఇరాన్ జ్యుడీషియరీ చీఫ్ ఘొలామ్‌హుసేన్ మొహ్సెనీ-ఎజీ అభిప్రాయపడ్డారు. ఇక ఆందోళనల సందర్భంగా మృతిచెందిన భద్రతాసిబ్బందిలో దాదాపు 100 మందికి ఇరాన్ బుధవారం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది.
Also Read: USA: పాకిస్తాన్, రష్యాలతో సహా 75 దేశాలకు వీసా ప్రాసెసింగ్ నిలిపివేత
Follow Us