US New Strategy: భారత్ పై అధిక సుంకాలు..జీ7 దేశాలపై అమెరికా ఒత్తిడి

ఇంతకు ముందు యూరోపియన్ యూనియన్..ఇప్పుడు జీ 7 దేశాలు..అమెరికా పద్ధతి ఏంటో అంతు పట్టకుండా ఉంది. ఒకవైపు భారత్ తో వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చుకుంటామని చెబుతూనే మరోవైపు జీ7 దేశాలకు భారత్ పై అదనపు సుంకాలను విధించాలని ఒత్తిడి చేస్తోంది.

New Update
G7

G7 Countries

తాము మంచిగా ఉండాలి.. కానీ భారత్ ఇబ్బందులు పడాలి. ఇప్పుడు అమెరికా కొత్త వ్యూహం ఇదే. ప్రస్తుతం ఆ దేశం వ్యవహరిస్తున్న తీరు చూస్తే కచ్చితంగా ఈ విషయం అర్థమౌతుంది. భారత్ తో వాణిజ్య సంబంధాలు, ఒప్పందాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తో సహా మంత్రులూ, అధికారుల కూడా సానుకూల దృక్పథం చూపిస్తున్నారు. ట్రంప్ అయితే ఒక అడుగు ముందు వేసి.. భారత ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని..ఆయనతోతానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను రాబోయే కొన్ని వారాల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ యంత్రాంగ కూడా ఇదే మాట చెబుతోంది. కానీ వెనుక నుంచి మాత్రం గోతులు తీస్తున్నారు.

Also Read :  భారత్, అమెరికాలు త్వరలోనే కలిసిపోతాయి..అమెరికా రాయబారి సెర్గియో గోర్

జీ 7 దేశాలపై ఒత్తిడి..

తాజాగా రష్యా(Russia) నుంచి చమురు ఉత్పత్తి చేసుకుంటున్న భారత్, చైనా(China) లపై అధిక సుంకాలను విధించాలని జీ 7 దేశాలపై అమెరికా ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మాస్కో యుద్ధ నిధులను తగ్గించే ప్రయత్నంలో మిత్రదేశాల నుంచి 50 నుంచి 100 శాతం సుంకాలను వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. G7 దేశాల(g7-meetings) ఆర్థిక మంత్రులతో ట్రంప్ యంత్రాంగం శుక్రవారం వీడియో కాల్ ద్వారా ఈ ప్రతిపాదనపై చర్చించనున్నట్లు చెబుతున్నారు. చైనా, భారత్ లు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ తో యుద్ధానికిఆజ్యం పోస్తున్నారని...ఉక్రేనియన్ ప్రజల అర్థం లేని చావులకు దారి తీస్తున్నారని అమెరికా ట్రెజరీ ప్రతినిధి అన్నారు. యుద్ధం ముగిసిన రోజే సుంకాలను తీసేస్తామని చైనా, భారత్ లకు చెప్పాలని జీ7 దేశాలకు సూచించామని ఆయన తెలిపారు.

శాంతి చర్చలకు రష్యాను ముందుకు తీసుకురావడానికి ఈ వ్యూహాన్ని అమెరికా అనుసరిస్తోందని చెబుతున్నారు. మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచితే రష్యా దారిలోకి వస్తుందని అమెరికా భావిస్తోంది. జీ7 దేశాలతో అమెరికా సమావేశాన్ని కెనడా ధృవీకరించింది. రష్యాపై ఒత్తిడి పెంచడానికి, వారి యుద్ధ యుద్ధ యంత్రాంగాన్ని పరిమితం చేయడానికి అవసరమయ్యే చర్యలపై ఆలోచిస్తామని ఆ దేశం తెలిపింది.

యూరోపియన్ యూనియన్ పై కూడా..

అంతకు ముందు వాషింగ్టన్‌లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ఈయూ అధికారులతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడారు. రష్యా మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం(trumptariffs) విధించాలని వాళ్లకి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామనిచెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.

ఇలా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఓ యూఎస్‌ అధికారి కూడా చెప్పారు. కానీ యూరోపియన్ యూనియన్‌(European Union) కూడా ముందుకు వస్తే దీన్ని కలిసి అమలుచేస్తామని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read :  నేపాల్ రాజకీయాల్లో తొలగని అనిశ్చితి.. ఎటూ తేల్చుకోలేకపోతున్న జెన్ జీ

Advertisment
తాజా కథనాలు