/rtv/media/media_files/2025/09/12/sergio-2025-09-12-07-28-44.jpg)
ట్రంప్ సన్నిహితుడు, వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్శనల్ ఆఫీస్ డైరెక్టర్ సెర్గియోగోర్ భారత్, అమెరికా వాణిజ్య చర్చ(india us trade war) లపై మాట్లాడారు. భారత రాయబారిగా తాను వచ్చే లోపునే అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని చెబుతున్నారు. రాబోయే రెండు, మూడు వారాల్లో అన్ని విషయాలు సద్దుకుంటాయనిగోర్గ్ తెలిపారు. దాంతో పాటూ సుంకాల విషయంలో కూడా రెండు దేశాలు ఒక ఒప్పందానికి వస్తాయని చెప్పారు. రీసెంట్ గా భారత్, అమెరికా వాణిజ్య సంబంధాల్లో తేడాలువచ్చాయని..కానీ ఇరు దేశాలు వ్యూహాత్మకంగా కలిసే ఉన్నాయని గోర్గ్ తెలిపారు. భారతదేశంలో అమెరికా రాయబారి పదవికి జరిగిన సెనేట్ కమిటీ విచారణలో గోర్సెనేటర్లతో మాట్లాడారు. అమెరికా, భారత్ లు రెండూ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలను కలిగి ఉన్నాయని..చైనాతోకంటే తాము అమెరికాకే దగ్గరగా ఉన్నామని గోర్గ్ అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో కూడా...ప్రపంచంలో అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటి అని ఉద్ఘాటించారు.
Also Read : అధ్యక్షుడు ఒకలా..వాణిజ్య మంత్రి మరొకలా..రష్యా చమురు కొనుగోలు ఆపితేనే చర్చలని ప్రకటన
రష్యా నుంచి చమురు కొనుగోలు మానేస్తేనే..
మరోవైపు అమెరికా వాణిజ్య మంత్రి లూట్నిక్ మాత్రం మరో రకంగా అంటున్నారు. తాజాగా హోవార్డ్ ఒక ఇంటర్య్యూలో భారత్ తో చర్చలపై మాట్లాడారు. ఇంతకు ముందు తీవ్ర హెచ్చరికలు చేసిన ఆయన ఇప్పుడు ఆచితూచి స్పందించారు. కానీ చివరకు మాత్రం భారత్...రస్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తేనే వాణిజ్య చర్చల్లో ముందుకు వెళ్తామనిసంకేతాలిచ్చారు. అమెరికా ఏ వాణిజ్య సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టిందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోవార్డ్ ఇది చెప్పారు. అయితే అంతకు ముందు భారత్ త్వరలోనే క్షమాపణలు చెబుతుందిఅంటూహోవార్డ్ తీవ్రంగా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సారి ఆ తీవ్రత లేకపోయినప్పటికీ...తమ ఆలోచన మాత్రం మారలేదని స్పష్టం చేశారు.
అంతకు ముందు వాణిజ్య సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో ప్రధాని మోదీతోట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రధాని మోదీ కూడా స్పందించారు. తాను కూడా ట్రంప్ తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానని తెలిపారు. భారత్, యూఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధినేతల స్వరాల్లో మార్పు చాలా కీలకంగా మారింది.
Also Read : నేపాల్ రాజకీయాల్లో తొలగని అనిశ్చితి..ఎటూ తేల్చుకోలేకపోతున్న జెన్ జీ