Nepal: నేపాల్ రాజకీయాల్లో తొలగని అనిశ్చితి..ఎటూ తేల్చుకోలేకపోతున్న జెన్ జీ

నేపాల్ రాజకీయాల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై జెన్ జీ ఉద్యమకారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్నటికే ఐదారుగురు పేర్లు తెర పైకి వచ్చినప్పటికీ ఎవరిని నియమిస్తారనేది మాత్రం సందేహాస్పదంగానే ఉంది.

New Update
Nepal burns as Gen Z protests topple Oli government, Army takes charge

Nepal burns as Gen Z protests topple Oli government, Army takes charge

నేపాల్ లో జెన్ జీ చేపట్టిన ఉద్యమానికి అక్కడ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇంతకు ముందు వరకు నేతలను నేపాల్ యువత తరిమి తరమి కొట్టారు. గత్యంతరం లేక ప్రధాని ఓలితోపాటూ అందరూ రాజీనామాలు చేసి పారిపోయారు. దీంతో ప్రస్తుతం నేపాల్ కంట్రోల్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీని తరువాత అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని జెన్ జీ ఉద్యమకారులు రెండు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అధినేతగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఒక నిర్ణయానికి మాత్రం రాలేకపోతున్నారు. ఐదారుగురి పూర్లు తెరపైకివచ్చినప్పటికీ..ఎవరీ మాత్రం కన్ఫార్మ చేయలేదు. మరోవైపు అక్కడి పార్లమెంటునురద్దు చేసి ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని, రాజ్యాంగాన్ని సవరించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

సారథిపై భిన్నాభిప్రాయాలు..

ఈ నేపథ్యంలో ఒక పరిష్కారం కనుగొనేందుకు నేపాల్‌ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌, ఆర్మీ చీఫ్‌ అశోక్‌ రాజ్‌ సింగ్డెల్‌తో జెన్‌-జెడ్‌ ప్రతినిధులు ఆర్మీ హెడ్‌క్వార్టర్‌లో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు సమాంతరంగా జెన్ జీ గ్రూపు ప్రతినిధులు మీడియా సమావేశాలు పెట్టి తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం తమను ఉపయోగించుకోవద్దని హెచ్చరిస్తున్నారు. జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించడం తమ ముందున్న అతిపెద్ద సవాల్‌ అని.. సంక్షోభ సమయంలో నేపాల్‌ పౌరులంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తాత్కాలిక సారథిగా మాజీ ఛీప్ జస్టిస్ సుశీల కర్కి, వద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ ఘీసింగ్ లను ప్రతిపాదించారు. అయితే వీరిద్దరిలో ఎవరన్నది మాత్రం తేలడం లేదు. ఆందోళనకారుల్లోనే వీరిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. వీరితో పాటూ బాలెన్ షా, రబీ లచ్చిమనే పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ చిన్న వయసు వారే కావడం..యువతలో వీరికి మంచి ఫాలోయింగ్ ఉండి..రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండడంతో కొంత మంది వారి పేర్లను ప్రతిపాదించారు. ఇక నేపాల్ హింసాత్మక సంఘటనల కారణంగా ఇప్పటివరకు 34 మంది చనిపోయారు. మరో 1338 మంది తీవ్రంగా గాయపడగా...వారందరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Also Read: Charlie Kirk: చార్లీ కిర్క్ ను చంపింది కాలేజీ యువకుడే..ఆధారాలు దొరికాయంటున్న ఎఫ్బీఐ

Advertisment
తాజా కథనాలు