/rtv/media/media_files/2025/05/18/fB8SESjjbYs6gC6xnke6.jpg)
First AI Docter
ప్రస్తుతం ఏఐ హవా నడుస్తోంది. భవిష్యత్తులో దీని వాడకం ఇంకా పెరుగుతుందని కూడా తెలుస్తోంది. అయితే ప్రపంచంలోనే ఏఐతో పరీక్షించే క్లినిక్‌ను మొదటిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభించింది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో అల్‌మూసా హెల్త్ గ్రూప్ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది కూడా చూడండి: RCB VS KKR: అయ్యో కేకేఆర్...టాస్ కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణం
World's First AI Doctor Clinic Opens In Saudi Arabia https://t.co/CGhRlo3oJ7 pic.twitter.com/ueJYOElxln
— NDTV (@ndtv) May 17, 2025
ముందుగా రోగులతో మాట్లాడి..
సౌదీలోని అల్ అహ్సా ప్రావిన్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏఐ డాక్టర్ ముందుగా రోగులతో మాట్లాడి ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ చేస్తుంది. ఆ తర్వాత చికిత్స చేయడానికి వైద్యులను తీసుకొస్తుంది. ఈ ఏఐ క్లినిక్ వినూత్న వైద్య సేవా వ్యవస్థ. ఇందులో ఏఐ వ్యవస్థ స్వతంత్రంగానే పనిచేస్తుంది. వివరాలు తీసుకోవడంతో పాటు మందులు ఇవ్వడం అన్ని సేవలను కూడా చేస్తోంది. ఈ ఏఐ వైద్య వ్యవస్థకు ‘డాక్టర్ హువా’ అని పేరు పెట్టారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు క్లినిక్‌కు వెళ్తారు. వీరు ఒక ట్యాబ్ సాయంతో ఏఐకి తమ వ్యాధి లక్షణాలను రోగి క్లియర్‌గా వివరించాలి.
ఇది కూడా చూడండి: Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
It's May 2025 and the world just got its first *AI CLINIC* in Saudi Arabia, made by Synyi AI (Chinese startup)
— Edrick🕗 (@edkesuma) May 17, 2025
It works by:
> Asking a series of questions on patient's symptoms
> Having assistant humans collect additional data if needed (x-rays, blood work, etc)
> Ending with a… pic.twitter.com/H6eAFFGsO7
ఇది కూడా చూడండి: Hydra: చెరువుల్లో వ్యర్థాలు, మట్టి పోస్తే జైలుకే.. హైడ్రా సంచలన నిర్ణయం!
ఇలా చెప్పిన వెంటనే ఆ ఏఐ డాక్టర్ కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇదంతా పూర్తి కాగానే డాక్టర్ హువా ఒక చికిత్స ప్రణాళికను అందిస్తుంది. దీన్ని వైద్యుడు చదివి అర్థం చేసుకుని సంతకం చేయాలి. ఈ ఏఐ డాక్టర్ ద్వారా ప్రస్తుతం 30 రకాల శ్వాసకోశ రుగ్మతలకు సంబంధించిన సేవలను అందిస్తున్నారు. అయితే కొన్ని ఏఐ పరిశీలించలేని అత్యవసర కేసులు కూడా ఉంటాయి. వీటి కోసం వైద్యులు అందుబాటులో ఉంటారు.
ఇది కూడా చూడండి: Rahul Gandhi: ముందు సమాచారం ఇవ్వడం ఏంటి...ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ..
first AI Docter | saudi-arabia | AI Docter | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu