Pahalgam terror attack : తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో టచ్‌లో ఉండి శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా అరెస్ట్ అయిన వారిలో హరియాణాకు చెందిన సోషల్ మీడియా స్టార్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. దేశానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు జ్యోతి మల్హోత్రా పంపినట్లు పక్కా ఆధారాలు దొరకడంతో అరెస్టు చేశారు. అయితే ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
Pahalgam Terror Attack - Jyoti's Instagram
దేశానికి ముప్పు తలపెట్టేలా పాకిస్తాన్ కు సహాయం చేసిన జ్యోతి మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్న పహల్గాం సమాచారాన్ని చేరవేసింది జ్యోతినే అని తేలింది. ఆమె జనవరిలోనే పహల్గాం ప్రాంతాన్ని సందర్శించి.. అక్కడి విషయాలను పాకిస్తాన్ ఉగ్రవాదులకు పంపించినట్లు పోలీసులు నిర్ధారించారు. పహల్గాం సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటలిజెన్స్ అధికారులకు జ్యోతి అందించినట్లు తేలింది. ధనిష్ అనే పాకిస్తాన్ అధికారికి జ్యోతి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంపించినట్లు అధికారులు విచారణలో రాబట్టారు. జ్యోతి జనవరిలో పహల్గాం సందర్శించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ బ్లాగర్‌గా పనిచేస్తుంది. ట్రావెల్ విత్ జో (Travel With Jo) పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తుంది. ఆ సందర్భంగా ఆమె అనేకసార్లు పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే ఆమెకు పాకిస్థాన్ కు చెందిన పలువురు ఐఎస్‌ఐ అధికారులతో పరిచయాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వారికి సమాచారం చేరవేసినట్లు అధికారులు వెల్లడించారు. 2023లో పాక్‌కు వెళ్లిన జ్యోతి అహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్‌తో పరిచయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అతను పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను పరిచయం చేసినట్లు తెలుస్తోంది. అలా వారికి భారతదేశానికి చెందిన సున్నిత అంశాలను చేరవేసినట్లు తేలింది.
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
BIG NEWS 🚨 Jyoti Malhotra's Instagram reel reveals a big secret.
— Times Algebra (@TimesAlgebraIND) May 17, 2025
She went to Pahalgam in January, then to Pakistan.
Jyoti Malhotra was in contact with an officer named Danish working in the Pakistan High Commission.
According to Hisar police, Jyoti was sending confidential… pic.twitter.com/Mh0QFxqb1q
Also Read : ఒక్క చూపుకే అమ్మాయిలంతా ఫ్లాట్.. కిల్లింగ్ లుక్స్‌లో వైష్ణవ్ తేజ్
india pak war | Pakistan Spy Scandal | spying | haryana