/rtv/media/media_files/2025/09/10/trump-2025-09-10-08-53-47.jpg)
Trump
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల భారత్‌పై 50 శాతం సుంకాలు విధించింన సంగతి తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే కారణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు మరో కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నారు. భారత్, చైనాతో పాటు ఆయా దేశాల దిగుమతులపై100 శాతం సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ (EU) దేశాలను కోరినట్లు తెలస్తోంది.
Also Read: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్
Trump Urges EU
వాషింగ్టన్‌లో సీనియర్ అమెరికన్, యూరోపియన్ యూనియన్ అధికారులు రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ ఈయూ అధికారులతో కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడారు. రష్యా మరింత ఆర్థిక ఒత్తిడిని తీసుకొచ్చేందుకు భారత్, చైనాపై 100 శాతం సుంకం(trump tariffs) విధించాలని వాళ్లకి సూచించినట్లు సమాచారం. ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపేస్తామని చెప్పేవరకు ఈ సుంకాలు కొనసాగించాలని కోరారు.
Also Read: భారత్ తో సుంకాలపై చర్చలు.. మోదీతో కూడా మాట్లాడతా అంటున్న ట్రంప్..
ఇలా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఓ యూఎస్ అధికారి కూడా చెప్పారు. కానీ యూరోపియన్ యూనియన్(European Union) కూడా ముందుకు వస్తే దీన్ని కలిసి అమలుచేస్తామని పేర్కొన్నారు. మరోవైపు అమెరికా సూచనలు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధికారులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. - international news in telugu
🚨Trump urges EU to impose 100% tariffs on India, China to pressure Russia. pic.twitter.com/MC4q1t7Kef
— Indian Infra Report (@Indianinfoguide) September 10, 2025