Nepal Protest: నేపాల్‌లో పడిపోయిన ప్రభుత్వం.. రంగంలోకి ఆర్మీ

నేపాల్‌ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడి ఆర్మీ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకుంది. ఆర్మీ చీఫ్‌ స్టాఫ్ జనరల్ అశోక్‌ రాజ్‌ సిగ్డెల్ మాట్లాడుతూ ఆందోళనకరాలు సంయమనం పాటించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి

New Update
Nepal burns as Gen Z protests topple Oli government, Army takes charge

Nepal burns as Gen Z protests topple Oli government, Army takes charge

నేపాల్‌(Nepal) ప్రభుత్వం సోషల్‌ మీడియా()Social Media) పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ మంగళవారం ఆందోళనకారులు మళ్లీ నిరసనలు చేపట్టారు. ప్రధానితో పాటు పలువురి మంత్రుల ఇళ్లను తగలబెట్టారు. అలాగే సుప్రీంకోర్టు(Supreme Court), పార్లమెంటుకు కూడా నిప్పు పెట్టారు. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 8న మొదలైన ఈ ఆందోళనలకు హింసాత్మక ఘటనలకు దారి తీశాయి. ఈ ఘటనలో ఇప్పటిదాకా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న జైల్లోకి కూడా నిరసనాకారులు దూసుకెళ్లారు. అక్కడ బందీగా ఉన్న 900 మంది ఖైదీలను విడుదల చేశారు.     

Nepal Burns As Gen Z Protests

Also Read: భారత్ తో సుంకాలపై చర్చలు.. మోదీతో కూడా మాట్లాడతా అంటున్న ట్రంప్..

నేపాల్‌ ప్రభుత్వం కూలిపోవడంతో అక్కడి ఆర్మీ శాంతి భద్రతలను అదుపులోకి తీసుకుంది. ఆర్మీ చీఫ్‌ స్టాఫ్ జనరల్ అశోక్‌ రాజ్‌ సిగ్డెల్ మాట్లాడుతూ ఆందోళనకారులు సంయమనం పాటించాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న హింసాత్మక ఘటనలు అదుపు చేయడం, దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, సాధారణ ప్రజలను రక్షించడం తమ పని అని పేర్కొన్నారు. మరోవైపు నేపాల్‌ ఆర్మీ ఆందోళనకారులను హెచ్చరించింది. కొంతమంది కావాలనే దేశంలో అశాంతి సృష్టిస్తూ, హింసాత్మక ఘటనలకు, దోపిడికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి కొనసాగితే సైనిక బలగం మొత్తం రంగంలోకి దిగుతుందని వార్నింగ్ ఇచ్చింది. 

ఇదిలాఉండగా మంగళవారం ప్రధాని కేపీ శర్మ ఒలీ(kp-sharma-oli) ఇంటికి నిరసనకారులు తగలబెట్టారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్‌ను వీధుల్లో పరిగెత్తించి మరి కొట్టారు. అలాగే పార్లమెంట్‌, సుప్రీంకోర్టు భవనాలకు కూడా నిప్పు పెట్టారు. అంతేకాదు మాజీ ప్రధాని షేర్ బహదూర్‌ డ్యూబాతో పాటు పలువురి సీనియర్ నేతల ఇళ్లపై కూడా దాడులు చేశారు. అంతేకాదు మరో మాజీ ప్రధాని జలనాథ్‌ ఖనాల్‌ ఇంటికి కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆయన భార్య రబి లక్ష్మీ చిత్రాకర్‌ తీవ్రమైన గాయాలతో మరణించారు. 

మరోవైపు నిరసనకారులు కాట్మాండులోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం సాయంత్రం చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే నేపాల్ ఆర్మీ ఆ ఎయిర్‌పోర్టును తమ నియంత్రణలోకి తీసుకుంది. ఇక భారత్‌ నుంచి నేపాల్ వెళ్లే పలు విమానాలను కూడా రద్దు చేశారు. ప్రధాని మోదీ కూడా నేపాల్‌ అల్లర్లపై స్పందించారు. నేపాలీ సోదర, సోదరీమణులు సంయమణం పాటించాలని కోరారు. శాంతికి మద్దతివ్వాలని కోరారు. 

Also Read: పరువునష్టం కేసులో ట్రంప్‌కు బిగ్‌ షాక్.. రూ.733 కోట్లు చెల్లించాలని కోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు