India-US Trade war: ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ..ఇండియా, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్ అని కామెంట్

ఇండియా, అమెరికా మళ్ళీ దగ్గరవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పట్టు వీడి భారత ప్రధాని తో మాట్లాడతానని చెప్పడంపై మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. తాను కూడా ట్రంప్ తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానని అన్నారు.

New Update
modi-trump

PM Modi- Trump

భారత్, అమెరికా సంబంధాల్లో మళ్ళీ మార్పులు వస్తున్నాయి. వాణిజ్య సుంకాల కారణంగా రెండు దేశాల మధ్యా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో ట్లాడేందుకు ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రధాని మోదీ కూడా స్పందించారు. తాను కూడా ట్రంప్ తో మాట్లాడేందుకు వెయిట్ చేస్తున్నానని తెలిపారు. భారత్, యూఎస్ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధినేతల స్వరాల్లో మార్పు చాలా కీలకంగా మారింది. 

రెండు, మూడు వారాల్లో అంతా సద్దుకుంటుంది..

అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు.  దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండియా, అమెరికాల మధ్య వాణిజ్య సమస్యల ఉద్రిక్తత నడుస్తోంది. వీటిపై తన పరిపాలనా విభాగం ఆల్రెడీ ఇండియాతో చర్చలు చేస్తోందని ట్రంప్ తెలిపారు. అది కాక వచ్చే రెండు , మూడు వారాల్లో తానే స్వయంగా భారత ప్రధాని మోదీ(PM Modi) తో మాట్లాడతానని చెప్పారు. మోదీ తనకు మంచి స్నేహితుడని..ఆయనతో మాట్లాడ్డానికి ఎదురు చూస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. రెండు దేశాలకు విజయవంతమైన ముగింపుకు వస్తాయని అన్నారు. ఇండియా, అమెరికాల మధ్య ఎటువంటి ఇబ్బంది ఉండదని..భవిష్యత్తులో కూడా రాకుండా చూసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. 

ఒకవైపు భారత్ తో దౌత్య సంబంధాలను మెరుగుపర్చుకుంటామని చెబుతూనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనుక గోతులు తీస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని(Russia-Ukraine War) ఆపేందుకు తనతో చేరాలని ట్రంప్ యూరోపియన్ నాయకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంగళవారం దీనికి సంబంధించి ఆయన యూరోపియన్ యూనియన్ అధికారులతో సమావేశం అయ్యారు. చైనాపై యూరప్ విధించే ఏ సుంకాలనైనా అమెరికా ఆమోదిస్తుందని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి పెంచాలని ట్రంప్ చెప్పారు. ఇందులో భాగంగా భారత్ పై యూరోప్ దేశాలు వంద శాతం సుంకాలను విధించాలని చెప్పారు. 

Also Read: Gold And Sliver Rates: మళ్ళీ భారీగా పెరిగిన బంగారం.. ఒక్క రోజులోనే రూ. 5 వేలకు పైగా..

#india us trade war #india-us-relations #pm modi #trump #today-latest-news-in-telugu
Advertisment
తాజా కథనాలు