US Army Bases: మిడిల్ ఈస్ట్ లోని అమెరికా కీలక స్థావరాలు ఇవే..

ప్రపంచంలో ఎక్కడ గొడవున్నా నేనున్నా అంటూ అమెరికా దూరుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా వచ్చింది. చెప్పపెట్టకుండా ఉన్నట్టుండి దాడులు చేసింది. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికా కీలక స్థావరాల మీద విరుచుకుపడుతోంది. 

New Update
us army

US Military Bases In Middle East

మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు కీలక సైనిక స్థావరాలు ఉన్నాయి. అమెరికన్‌ యూనివర్సిటీ పొలిటికల్‌ ఆంత్రోపాలజీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ వైన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2021 నాటికే అమెరికాకు 80 దేశాల్లో 750 సైనిక స్థావరాలున్నాయి. జపాన్ లో 120, జర్మనీలో 119, దక్సిణ కొరియాలో 79 ఉన్నాయి. ఆ తరువాత పశ్చిమాసియాలో ఎక్కువ ఆర్మీ స్థావరాలున్నాయి. వాటిల్లో 40 వేల మంది సైనికులు ఉన్నారు. ఇందులో చాలా వరకు సముద్రాల్లోని యుద్ధ నౌకల్లో మిగిలిన వారు 19 స్థావరాల్లో ఉన్నారు. 

Also Read :  పవన్ కల్యాణ్ తల్లికి తీవ్ర అస్వస్థత.. షూటింగ్ మధ్యలోనే ఆపేసిన చిరు..

మిడిల్ ఈస్ట్ లో అమెరికా మిలిటరీ స్థావరాలు..

మిడిల్ ఈస్ట్ లోని బహ్రెయిన్, ఈజిప్టు, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో అమెరికా ఆర్మీ స్థావరాలున్నాయి. ఇందులో 8 స్థావరాలు యూఎస్ శాశ్వతం చేశాయి.   వీటిల్లో మొట్టమొదటిసారిగా 1958లో ఏర్పాటు చేసింది.  లెబనాన్‌ సంక్షోభం సమయంలో బీరుట్‌కు సైన్యాన్ని అమెరికా పంపింది.  

Also Read :  కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన చాకలి ఐలమ్మ మనవరాలు

ఖతార్ రాజధాని దోహాలోని ఎడారిలో అల్ ఉదీద్ సైనిక స్థావరం ఉంది. ఇది అన్నింటికంటే అతి ముఖ్యమైనది. ఇది అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఇక్కడ ఒక్కచోటే పదివేల మంది సైనికులు ఉన్నారు.  ఇది ఈజిప్టు నుంచి తూర్పు కజికిస్థాన్ వరకూ కార్యకలాపాలను చూసుకుంటుంది.  తర్వాత ఇరాక్ లోని అంబర్ ప్రావిన్స్ లో అల్ అసద్ వైమానిక స్థావరం ఉంది. నాటూ మిషన్ కు ఇది సాయం అందిస్తుంది.  బహ్రెయిన్ లో అమెరికా స్థావరంలో 8, 300 మంది సైనికులు ఉన్నారు. అమెరికా నౌకాదళ కార్యకలాపాలకు ఈ స్థావరం కీలకం. గల్ఫ్, ఎర్ర సముద్రం, అరేబియన్‌ సముద్రంతోపాటు హిందూ మహా సముద్రంలోని కొంత భాగాన్ని ఇది పర్యవేక్షిస్తుంది. 

Also Read :  అల్లు అర్జున్- అట్లీ మూవీ నుంచి కిర్రాక్ అప్డేట్.. ఇక రచ్చరచ్చే!

కువైట్‌లో అరిఫ్‌జాన్, అలీ అల్‌ సలేంలలో అమెరికా స్థావరాలున్నాయి. అరిఫ్‌జాన్‌.. అమెరికా సెంట్రల్‌ సైన్యానికి ప్రధాన కేంద్రం. వీటితో పాటూ 2003లో ఇరాక్ యుద్ధ సమయంలో క్యాంప్ బుహ్ రింగ్ ను అమెరికా ఏర్పాటు చేసింది. ఇది ఇరాక్, సిరియాల్లో సేవలందిస్తోంది. ఇక యూఏఈలోని అబుదాబిలో అల్ దఫ్రా లో వైమానికి స్థావరం ఉంది. ఇది యూఏఈ వైమానిక దళంతో కలిసి పని చేస్తుంది. ఐసిస్‌ ఉగ్ర సంస్థ కార్యకలాపాలను అడ్డుకునే కీలక మిషన్‌లో ఇది అంతర్భాగం. సౌదీ అరేబియాలోని రియాద్‌కు దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరం ఉంది. ఇక్కడ 2321మంది అమెరికా సైనికులున్నారు. 

Also Read: Iran-Israel: రెచ్చిపోతున్న ఇరాన్..ఇజ్రాయెల్ పైనా దాడులు

 

usa | middle east | today-latest-news-in-telugu | telugu-news | today-news-in-telugu | latest-telugu-news | international news in telugu | US Army Bases

Advertisment
Advertisment
తాజా కథనాలు